Movies

నానికి జోడీ కోసం 6గుర్ని లైన్ లో పెట్టారా….మాములుగా లేదు మరి

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ మూవీ చేస్తున్న నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతని లిస్టులో ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వి’మూవీ ఒకటి రిలీజ్ కి రెడీగా ఉన్నా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక టక్ జగదీష్ సినిమా షూటింగ్ కూడా ఆగింది. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమాని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని చేస్తున్నాడు. ఈ సినిమాలో పీరియాడికల్ కథతో డిఫరెంట్ ఎలిమెంట్ తో రూపొందబోతోందట.

నాని కెరియర్ లో జెండాపై కపిరాజు, జెంటిల్మెన్ సినిమాల తర్వాత మరో సారి ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా చిత్ర యూనిట్ ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనల్ చేసింది. ఇక ఆ ముగ్గురు హీరోయిన్స్ కోసం ఏకంగా ఆరుగురు హీరోయిన్ ని చిత్రబృందం లైన్ లో పెట్టిందట.

ఇందులో రష్మిక, రాశీ ఖన్నా, సాయి పల్లవి, నివేతా థామస్, రీతూవర్మ, నిధి అగర్వాల్ పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిలో సాయి పల్లవి, రష్మిక మంచి జోష్ లో ఉన్నారు. అలాగే ఈ భామలు క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తారట. ఈ ఆరుగురు భామలలో ఫైనల్ గా ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనల్ చేయాలని చూస్తున్నారు. అయితే కొంత టైం తీసుకొని క్యాస్టింగ్ ఫైనల్ చేస్తారా,వెంటనే సెలెక్ట్ పూర్తిచేస్తారా అనేది చూడాలి.