Movies

అగ్నిపర్వతం సెన్షనల్ హిట్ వెనుక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు

ఆదుర్తి సుబ్బారావు తీసిన తేనెమనసులు మూవీ ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ 300పైగా మూవీస్ చేసి , తెలుగులో ఎన్నో ప్రయోగాలు చేసి, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా నిలిచాడు. ఇప్పుడు ఆయన కొడుకు మహేష్ బాబు తండ్రిని మించిన తనయుడిగా సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే కృష్ణ నటించిన సినిమాల్లో కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన అగ్ని పర్వతం మూవీ ఓ సెన్షేషనల్ హిట్. కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు.

ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన సమయం కావడంతో 1983లో కృష్ణ మరింత స్పీడ్ గా దూసుకెళ్లాడు. ఇక ఖైదీ రూపంలో చిరంజీవి దూసుకురావడం,అక్కినేని,శోభన్ బాబు,కృష్ణంరాజు వంటివాళ్ళు కొంత తగ్గడంతో కృష్ణ హవా తగ్గలేదు. 1985లో వచ్చిన అగ్నిపర్వతం ఇందుకు తార్కాణం. మాఫీయా డాన్ జమదగ్ని, పోలీసాఫీసర్ చంద్రం పాత్రల్లో కృష్ణ నటించినప్పటికీ జమదగ్ని పాత్ర బాగా సూటయ్యింది. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు,చక్రవర్తి సంగీతం,విజయశాంతి,రాధ గ్లామర్ ఈ సినిమాకు ఎసెట్ గా మారాయి.

జీవితంలో దెబ్బతిని, తండ్రి చేతిలో మోసపోయిన తల్లి కోసం పగతో రగిలిపోతూ మంచికోసం డాన్ గా మారిన జమదగ్ని పాత్ర ఒక ఎత్తయితే అందులో అగ్గిపెట్టె ఉందా అంటూ జమదగ్ని పాత్ర పలికే డైలాగ్ పవర్ ఫుల్ అయింది. ఈ డైలాగ్ సంచలనం సృష్టించింది. ఎక్కువ కేంద్రాల్లో వందరోజులు ఆడడమే కాకుండా అప్పట్లో 8సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ ఆడడం కూడా ఓ సంచలనమే. కృష్ణ ఫాన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేసిన ఈ మూవీ మహేష్ బాబు కూడా చేస్తే భలే ఉంటుందని ఆశగా ఉందట. చూద్దాం భవిష్యత్తులో ఎలా జరుగుతుందో.