Kitchen

ఎగ్ తో మసాలా కర్రీ చేసుకుందామా

కావలసినవి:

కోడిగుడ్లు – 5(ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు – 2
టొమాటో – 1 (పెద్దది)
అల్లం, వెల్లుల్లి ముద్ద – టీ స్పూన్
కారం – టీ స్పూన్
పసుపు – పావు టీ స్పూన్
ధనియాలపొడి – టీ స్పూన్
ఉప్పు – సరిపడా
కరివేపాకు – రెండు రెబ్బలు
పుదీనా – కొన్ని ఆకులు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర – గార్నిష్‌కి సరిపడా

మసాలా పేస్ట్ కోసం:
సోంపు – అర టీ స్పూన్
గసగసాలు – టీ స్పూన్
దాల్చినచెక్క – 1
లవంగాలు – 2
ఏలకులు – 2
జీడిపప్పు – 6(పై పదార్థాలు 2 నిమిషాలు వేయించి పేస్ట్ చేసుకోవాలి)

తయారి విధానం
పాత్రలో నూనె వేడయ్యాక ఉల్లిపాయలు లేత ఎరుపు రంగు వచ్చేవరకు వేయించి, అల్లం, వెల్లుల్లి ముద్ద, పుదీనా, కరివేపాకు జత చేసి మూడు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాలపొడి, ఉప్పు వరుసగా వేసి కలపాలి. టొమాటో ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి.మసాలా ముద్ద జత చేసి, మధ్య మధ్యలో కలుపుతూ ఎనిమిది నిమిషాలు వేగనివ్వాలి. కోడిగుడ్లు వేసి అయిదు నిమిషాలు వేయించాక రెండు కప్పుల నీటిని పోసి మూతపెట్టి మిశ్రమం కాస్త దగ్గర అయ్యే వరకు ఉంచి, కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేయాలి.