Movies

బిగ్ బాస్ లో ఈ సారి పారితోషికాలను ఎలా ఇస్తున్నారో తెలుసా ?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో.. బిగ్ బాస్. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన మూడు సీజ‌న్లూ సూప‌ర్ హిట్ల‌య్యాయి. ఇప్పుడు నాలుగో సీజ‌న్ మొదలు కావటానికి సిద్ధంగా ఉంది. ఈ నాల్గో సీజన్ ఎప్పుడో మొదలు కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆగస్టు లో బిగ్ బాస్ ప్రారంభం కానున్నది. బిగ్ బాస్ సీజ‌న్ మొద‌ల‌య్యే ప్ర‌తీసారీ… ఓ భారీ ప్రెస్ మీట్ పెట్టి, మీడియాని ఆహ్వానించ‌డం అల‌వాటు. కానీ ఈసారి.. అలా ఏం లేదు. సింపుల్ గా లాంచ్ చేద్దామని అనుకుంటున్నారు.

బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే లిస్ట్ సెట్ అయింది. ఈ సారి షో 50 రోజులు జరుగుతుంది. పారితోషికాల్లో కూడా భారీగా కోత పడనున్నదని సమాచారం. ఇది వ‌ర‌కు రోజుకి ఇంత అని ఇచ్చేవారు. ఇప్పుడు అందులో స‌గం మాత్ర‌మే ముట్ట‌జెబుతున్నార‌ని తెలుస్తోంది. స్పాన్స‌ర్లు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని, వచ్చినా ఇది వ‌ర‌క‌టిలా భారీ మొత్తాలు వెచ్చించ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స‌మాచారం. దాంతో.. బ‌డ్జెట్ త‌గ్గింది. ఈ సీజ‌న్‌కి నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."