Movies

ప్రభాస్ సినిమా కోసం దీపికా ను ఒప్పించారా…. అన్ని కోట్లు ఇచ్చి మరీ…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పదుకొనె రెమ్యునరేషన్ ప్రస్తుతం 15 నుంచి 20కోట్లకు మధ్యన ఉంటుందని బాలీవుడ్ మీడియాలో టాక్. ఇక కొన్నిసార్లు సినిమా మార్కెట్ ని బట్టి పేమెంట్స్ పెంచే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ భామను ప్రభాస్ 21వ సినిమా లో హీరోయిన్ గా పెట్టారు. పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో రూపొందుతోంది. పైగా వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించే సినిమా. అందునా వైజయంతి మూవీస్ 50వ సంవత్సరంలో అడుగిడిన సమయంలో తీస్తున్న సినిమా. ఇన్ని స్పెషాల్టీస్ గల ఈ మూవీలో హీరోయిన్ కూడా ఆ రేంజ్ లో ఉండాలి.

అందుకే దీపికాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని టాక్. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చే ఈ మూవీలో దీపికా రేంజ్ కి తగ్గట్లే పారితోషికం ముట్టజెప్పారని టాక్. నిజానికి రెమ్యునరేషన్స్ అనేవి ఈ రోజుల్లో చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ఒక సినిమా హిట్టవ్వగానే తర్వాత సినిమాకు ఊహించని విధంగా రెమ్యునరేషన్ పెరగడం కామన్ అయిపొయింది. స్టార్ హీరోస్,హీరోయిన్స్ ఇలా రేట్లు పెంచేయడం వలన చిన్న నిర్మాతలు జంకుతున్నారు. పైగా కరోనా కష్టకాలంలో పెద్ద నిర్మాతలు సైతం ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే స్థాయిలో లేరు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీపికా పదుకొనె రెమ్యునరేషన్ పై పడింది.

ప్రభాస్ 21వ సినిమాకు దీపికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంతకు ఒప్పుకుంది అనేది హాట్ టాపిక్ అయింది. గత నెల రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రూమర్ బాగా వైరల్ అయ్యింది.. మొన్నటి వరకు దీపికాను కాదని కీయరా అద్వానీతో కూడా చర్చలు జరిపినట్లు టాక్ వచ్చింది. ఇక నేటితో ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది సాధారణంగా వైజయంతి మూవీస్ అనగానే భారీ బడ్జెట్ సినిమాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్. అగ్ర తారలను సెలెక్ట్ చేసుకొని వారి మార్కెట్ కి తగ్గట్టుగా రెమ్యునరేషన్స్ కూడా ఇస్తుంటారు. అయితే శక్తి సినిమాతో దెబ్బతిన్నాకా.. గ్యాప్ తీసుకొని మహానటితో మళ్ళీ పుంజుకున్నారు. ఇక అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని దీపికా చెప్పేసిందన్న టాక్ నేపథ్యంలో ఆమెను ఎంతకు ఒప్పించారన్నది ఇంకా తేలలేదు. క్లారిటీ రావాల్సి ఉంది.