ఎఫ్ 2 హీరోయిన్ ఇండస్ట్రీ నుంచి అవుట్…కారణం ఆ హీరోనా?

కొందరికి సినిమా ఇండస్ట్రీ బంగారు బాతులాంటిది అయితే కొందరికి రిక్త హస్తాలు చూపిస్తుంది. మరికొందరికి అక్షయ పాత్రలా ఉంటుంది. అందం,అభినయం ఉన్నా సరే,కొందరికి ఛాన్స్ లు రావు. సరిగ్గా హీరోయిన్ మెహ్రీన్ విషయంలో అలానే అవుతోంది. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ కెరీర్ ఈమె కెరీర్ కి దోహదం చేయాలి. అంతలా గత ఏడాది ఈ బబ్లీ బ్యూటీ కి కల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత సాయి తేజ్, నాగశౌర్య, కల్యాణ్ రామ్ లాంటి యంగ్ హీరోలు తనను కోరుకుని ఛాన్స్ లు ఇచ్చారు.

కానీ అవేవీ కలిసి రాకపోవడం నిజంగానే కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. హిట్టును నమ్మే సినీ పరిశ్రమ లో మెహ్రీన్ పాలిట శాపమైంది. అనుకున్నది దక్కలేదు. ఇక కరోనా కూడా చుట్టుముట్టేయడంతో 2020 అసలే కలిసి రాలేదు. నిజానికి ఈ ఏడాది రెండు సినిమాలు చేసింది. అశ్వద్ధామ లాంటి ఆఫర్ తనకు ఉపయోగపడలేదు.

అలాగే తమిళ చిత్రం పట్టాస్ కూడా అచ్చిరాలేదు. ఇకనైనా ఆఫర్లు వస్తాయ న్న గ్యారంటీ లేదు అందుకే మెహ్రీన్ ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇక డైరెక్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందట! కరోనా క్రైసిస్ తరువాత మెహ్రిన్ కి ఇంకా తెలుగు లో ఛాన్స్ లు తక్కువ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కన్నడ పరిశ్రమ పై బాగా గురి ఉందని టాక్. మెహ్రిన్ కి ఇటీవల కన్నడ నుంచి కాల్స్ వస్తున్నాయట. అలానే ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో కూడా మెహ్రిన్ కి బాగానే ఛాన్స్ లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే, మొత్తం ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటుందా, తెలుగులోనే తప్పుకుంటుందా అనేది తెలియాలి.