బాషా,బిగ్ బాస్ మధ్య లింక్ ఏమిటి…దీని వెనక మీకు తెలియని ఆసక్తికర కధనం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్,టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు బాషా, బిగ్ బాస్ ల మూవీలకు ఒక విచిత్రమైన లింక్ ఒకటి ఉంది. 1994ఆగస్టులో మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా బిగ్ బాస్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది . గ్యాంగ్ లీడరు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ షూటింగ్ లొకేషన్ కి దగ్గరలోనే రజనీకాంత్ బాషా మూవీ షూటింగ్ చేస్తున్నారు.
నిజానికి ఈ రెండు స్టోర్ లైన్స్ ఒకేలా ఉంటాయని అప్పుడే వెలుగులోకి వచ్చేసింది. దీంతో బిగ్ బాస్ స్టోరీలో మార్పులు చేద్దామని చిరంజీవి చెప్పారట. ఈలోగా బాషా డైరెక్టర్ సురేష్ కృష్ణ తో చిరు ఒక లొకేషన్ లో కలవడం బాషా స్టోరీ మొత్తం చెప్పడం జరిగాయి. దీంతో పక్కనే ఉన్న అల్లు అరవింద్ బాషా తెలుగు రైట్స్ తీసుకుని బిగ్ బాస్ పేరుతొ రీమేక్ చేద్దామని ప్లాన్ చేసాడు.
రీమేక్ కోసం 40లక్షలకు బేరం చెప్పడంతో 25లక్షలకు అరవింద్ సదరు నిర్మాతలతో బేరం ఆడితే కుదరలేదు. ఈలోగా 1995జనవరిలో బాషా విడుదలై సంచలన విజయం సాధించింది. అల్లు అరవింద్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బాషా తెలుగులో డబ్ అయింది. ఇక బిగ్ బాస్ స్టోరీలో కొన్ని మార్పులుచేర్పులు చేసి, ఆరుమాసాల తర్వాత రిలీజ్ చేసారు.

