Movies

బాలయ్య,కోడిరామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎన్నిహిట్ అయ్యాయో…?

ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్స్ అదిరిపోతాయి. హిట్ మీద హిట్ అందుకుంటాయి. టాలీవుడ్‌లో అలాంటి కాంబినేషన్ చెప్పుకోవాలంటే, నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ లకు అప్పటిలో మంచి క్రేజ్ ఉండేది. వీళ్ల కాంబినేషన్‌లో మొత్తంగా 7 చిత్రాలు తెరకెక్కితే.. అందులో ఐదు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాయి. అయితే ఒకటి సూపర్ హిట్.. ఒక చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. వీరిద్దరి కాంబోలో తొలి చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’ సినిమా. ఈ మూవీ హీరోగా బాలయ్యకు మంచి బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు చాలా సెంటర్స్‌లో ఈ చిత్రం 500 రోజులకు పైగా నడిచి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

బాలయ్య,కోడి రామకృష్ణ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘ముద్దుల కృష్ణయ్య’ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక మూడో చిత్రం ‘మువ్వ గోపాలడు’ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఐదో చిత్రం ‘ముద్దుల మావయ్య’ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని నమోదు చేసుకుంది. అయితే నాల్గో చిత్రం ‘భారతంలో బాలచంద్రుడు’సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని నమోదుచేయలేదు. అలాగే బాలయ్య,కోడి రామకృష్ణ కాంబోలో వచ్చిన ఆరో చిత్రం ‘బాల గోపాలుడు’ మంచి విజయాన్నే నమోదు చేసింది.

ఏడో చిత్రం ‘ముద్దుల మేనల్లుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నమోదైంది. అయితే ఎనిమిదో చిత్రంగా ’విక్రమసింహ భూపతి’ ప్రారంభమైంది. దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీటైన ఈ జానపద చిత్రం నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మరణంతో నిలిచిపోయింది. ఇక ‘మాతో పెట్టుకోకు’ సినిమా ముందుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకు బాలయ్యకు ఏదో మనస్పర్ధలు రావడంతో కోడి రామకృష్ణ తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు ఏ.కోదండరామిరెడ్డి తీసుుకున్నారు. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.