శేఖర్ కమ్ముల హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా ?
అందంగా లేనా అసలేం బాలేనా… అనే పాట వింటుంటే మన కళ్లెదుట హీరోయిన్ కమిలిని ముఖర్జీ గుర్తొస్తుంది. కోల్ కత్తా ప్రాంతంలో పుట్టిన ఈమె 2004లో ఆనంద్ – ఒక మంచి కాఫీ లాంటి సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక కమిలిని తల్లి బంగారు నగల డిజైనర్ గా పనిచేసేవారట. తండ్రి మెరైన్ ఇంజనీరు.
కోల్ కత్తా లోని యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషు లిటరేచర్ డిగ్రీ చేసిన కమిలిని ముఖర్జీ అదే సమయంలో భారతనాట్యంలో కూడా శిక్షణ తీసుకుంది. ఇక సినిమాల్లో నటించేయాలన్న కోరికతో ఆనంద్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. చూడ్డానికి తెలుగు అమ్మాయిలా ఉండే ఈ అమ్మడు,గ్యాప్ తీసుకుని సినిమాలు చేసింది. హ్యాపీ డేస్,గోదావరి,స్టైల్,గోపి గోపిక గోదావరి,విరోధి,నాగవల్లి సినిమాల్లో చేసింది.
తెలుగులోనే కాదు,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో నటించింది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కల్సి ముంబైలో నివాసం ఉంటోంది. ఈమె తెలుగులో చేసిన చిట్టచివరి సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’మూవీలో చేసింది. ఆతర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మ మళ్ళీ కనిపించలేదు.

