Movies

హీరో తరుణ్ కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా ?

టాలీవుడ్ లో ఒకప్పుడు బాలనటిగా ,ఆతర్వాత హీరోయిన్ గా, నటిగా రాణించి,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న రోజా రమణి కొడుకు తరుణ్ కూడా బాల నటుడుగా పేరుతెచ్చుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన తరుణ్ 1983జనవరి జన్మించాడు. తరుణ్ కుమార్ పూర్తిపేరు. నువ్వేకావాలి మూవీతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరుణ్ ఇంతవరకూ పెళ్ళికి దూరంగా ఉన్నాడు. ఆర్తి అగర్వాల్ తో ప్రేమ ఫెయిల్ కావడం వలన దూరంగా ఉన్నాడని ప్రచారం. సూపర్ హిట్ 3, సెమిహిట్స్ 4, యావరేజ్ 6, డిజాస్టర్లు,ప్లాప్స్ కలిపి 9ఉన్నాయి.

ప్రస్తుతం చిన్న చిన్న బిజినెస్ లు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణ్ మనసు మమత మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. నువ్వేకావాలి మూవీతో బ్లాక్ బస్టర్ అనుకున్నప్పటికీ ప్రియమైన నీకు మూవీతో లవర్ బాయ్ గా టాలీవుడ్ లో తన సత్తా చాటాడు. చిరుజల్లు మూవీతో హిట్ కొట్టి,ఆతర్వాత 2002లో నువ్వులేక నేను లేను మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. తర్వాత వచ్చిన అదృష్టం మూవీ దురదృష్టం మిగిల్చింది. నువ్వే నువ్వే మూవీతో మరో హిట్ అందుకున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ లతో టాలీవుడ్ లో తరుణ్ తన సత్తా చాటాడు. 2003లో నిన్నే ఇష్టపడ్డాను మూవీ ఏవరేజ్ గా నిల్చింది. ఎలా చెప్పను మూవీ టాలీవుడ్ లో సెన్షేషన్. అదే ఏడాది వచ్చిన నీ మనసు నాకు తెలుసు మూవీ ప్లాప్ అయినా హీరోగా క్రేజ్ తగ్గలేదు. సఖియా, సోగ్గాడు ప్లాప్ తెచ్చాయి. 2007లో నవ్వుకోసం మూవీతో హిట్ కొట్టాడు. 2008లో భలేదొంగలు యావరేజ్. శశిరేఖా పరిణయం సూపర్ హిట్. తర్వాత చుక్కలాంటి అమ్మాయి,చక్కనైన అబ్బాయి ,యుద్ధం మూవీస్ ప్లాప్ గా నిలిచాయి. చివరిగా ఇదేనా లవ్ స్టోరీ మూవీ కూడా ప్లాప్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."