Movies

కె విశ్వనాధ్ గారి కెరీర్ లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ ట్రెండ్ లో కళాత్మక విలువలతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకునిగా పేరొందిన కళాతపస్వి కె విశ్వనాధ్ సినిమాలో యాక్ట్ చేయాలనీ అందరూ కోరుకున్నవారే. కథ, కథనమే హీరోగా ఆయన సినిమాల్లో పాత్రలు నడుస్తాయి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న విశ్వనాధ్ కళాతపస్వి అయ్యారు. ఎన్నో జాతీయ అవార్డులు,నంది అవార్డులు ఈయన సినిమాలు సొంతం చేసుకున్నాయి. ట్రెండ్ సెట్టర్ అయ్యాయి. పింక్ లాంటి సినిమాలు చూసి ఇప్పుడు వచ్చే కోర్టు సీన్స్ తో కూడిన సినిమాలు చూసి తెలుగులో ఎందుకు రావు అనుకుంటారు ఎప్పుడో 1968లోనే సుడిగుండాలు సినిమా చూస్తే మన రేంజ్ ఏమిటో తెలుస్తుంది. దీనికి అసిస్టెంట్ గా విశ్వనాధ్ పనిచేసారు. ఇక 1973లో విశ్వనాధ్ తీసిన నేరము శిక్ష మూవీ చూస్తే చిన్న చిన్న తప్పులు కారణంగా కొన్ని ఫ్యామిలీ లు ఎలా నష్టపోతాయో తెలుస్తుంది. ఇక 1974లో ఓ సీత కథను అద్భుతంగా తెరకెక్కించారు. తాను కోరుకున్న అమ్మాయి తనకు తల్లిగా వస్తే పడే వ్యధ ఎలా ఉంటుందో చూపించారు.

1976లో వచ్చిన సిరిసిరి మువ్వ మూవీ లో మూగమ్మాయిగా జయప్రద,ఆమెను అభిమానించే సాంబయ్య పాత్రలో చంద్రమోహన్ ఎప్పటికీ అద్భుతమే. 1978లో సీతామహాలక్ష్మీ,సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ,లొసుగులను చూపించారు. ఓ సంగీత పండితుణ్ణి ఓ వేశ్య ఇష్టపడడమా అంటే నిజంగా ఆశ్చర్యపోయే అంశం. కానీ అదే ఇతివృత్తంతో శంకరాభరణం సినిమా తీసి, సంగీతంలో ఓలలాడించారు. పండిత పామూరులను రంజింపజేశారు. స్టార్ హీరోలేకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. నిరుద్యోగంతో కొట్టుమిట్టాడే యువతకు స్ఫూర్తినిచ్చేలా 1982లో శుభలేఖ మూవీ చేసారు. టాలెంట్ ఏ ఉద్యోగం అయినా చేయొచ్చని, ప్రేమకు కులమతాలు అడ్డురావని ఈ మూవీ చాటింది.

ఓ కళాకారుని బాధను ప్రపంచానికి తెలియజెప్పిన సినిమా సాగరసంగమం. నాట్యకారునిగా కమల్ హాసన్ నటన, ఈమూవీలో అందమైన ప్రేమను జొప్పించడం అద్భుతం. సమాజంలో ఒంటరి మహిళ ఎదుర్కొనే బాధ,ఓ అమాయకుడైన వ్యక్తి అండగా నిలవడం ఆవిష్కరించిన అద్భుత చిత్రం స్వాతిముత్యం. కమల్ కన్నా రాధిక ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. గేయ రచయితగా సిరివెన్నెల సీతారామ శాస్త్రిని పాటల రచయితగా పరిచయం చేస్తూ వచ్చిన సిరివెన్నెల మూవీ హీరో అంధుడు,హీరోయిన్ మూగ వీళ్లిద్దరి ప్రేమను అందంగా మలిచిన చిత్రమే సిరివెన్నెల.

ఇక మన మూలాలను ఏప్పటికీ మరువకూడదని చాటిచెప్పే చిత్రం శృతిలయలు. కాగా 1987లో మెగాస్టార్ గా మాస్ ఇమేజ్ తో దూసుకుపోతున్న దశలో చిరంజీవి హీరోగా చెప్పులు కుట్టే పాత్రలో నటింపజేస్తూ తీసిన సినిమా స్వయంకృషి. పిల్లలను బాధ్యత లేకుండా పెంచితే జరిగే నష్ఠాలను చూపించిన సినిమా. ఆతర్వాత ఏడాది విక్టరీ వెంకటేష్,భానుప్రియ జంటగా స్వర్ణ కమలం మూవీ. కళను బతికించడం, దాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం ఎంత అవసరమో ఈ సినిమా లో చూపించారు. 1989లో వచ్చిన సూత్రధారులు మూవీలో అహింసతో విలన్ కి బుద్ధిచెప్పే విధానాన్ని చూపించారు.

అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్ర. ఇక మెగాస్టార్ హీరోగా ఆపద్భాందవుడు మూవీ లో నిస్వార్ధంగా ఎంతటి కష్టమైనా భరించడాన్ని చూపించారు. కళకు కరుణ కావాలె తప్ప ఈర్ష్య కాదని చాటిన చిత్రం స్వాతికిరణం. ఇక 1995లో శుభ సంకల్పం మూవీ లో నటుడిగా కూడా విశ్వనాధ్ ఎంట్రీ ఇచ్చారు. 2010లో వచ్చిన శుభప్రదం మూవీ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన చిత్రం. ఇదే విశ్వనాధ్ ఆఖరి మూవీ. తర్వాత నుంచి నటుడిగానే కొనసాగుతున్నారు.