Movies

టాప్ TRP సంపాదించిన సినిమాలు ఎన్ని ఉన్నాయో చూడండి

లాక్ డౌన్ ,కరోనా కారణంగా జనాలు ఇంట్లోనే ఉండడంతో టివిలో వచ్చే సినిమాలకు మంచి టిఆర్పి రేటింగ్ వస్తోంది. గతవారం టివిలో వచ్చిన వెంకీ మామ టాప్ టిఆర్పి రేటింగ్ అందుకుంది. విక్టరీ వెంకటేష్,నాగచైతన్య కల్సి నటించిన ఈ సినిమా థియేటర్లలో సైతం అదరగొట్టిన సంగతి తెల్సిందే. ఇక రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ థియేటర్లలో ప్లాప్ కాగా, తిలివిజన్ లో వేస్తె ,టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లింది.

పాత సినిమాల్లో జయం,ఆర్య మంచి టిఆర్పి రేటింగ్ వచ్చాయి. డిజాస్టర్ గా నిల్చిన డియర్ కామ్రేడ్ లాంటి మూవీ కూడా టివిలో మంచి టిఆర్పి రేటింగ్ తెచ్చుకుంది. రంగస్థలం,అరవింద సమేత వీర రాఘవ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ప్రతిరోజూ పండగే లాంటి సినిమాలు కూడా మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తున్నాయి.

వెంకీమామ 4.8టిఆర్పి రేటింగ్ వస్తే, వినయ విధేయ రామ 7.5టిఆర్పి వచ్చింది. డియర్ కామ్రేడ్ 6.05రేటింగ్ వచ్చింది. ప్రతిరోజూ పండగే 5.6తో వెళ్ళింది. సర్కార్ 3.95, రంగస్థలం 3.92 ,టాక్సీవాలా 3.88, అరవింద సమేత 3.55,జయం 3.48, ఆర్య 2.84,ఎజికె 2.38టిఆర్పి రేటింగ్ సాధించాయి. వినయ విధేయ రామ అల్టిమేట్ విజయవంతంగా నడిస్తే, ఓ బేబీ సినిమా కూడా తక్కువ కాదని నిరూపించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."