Movies

అదుర్స్ మూవీ వెనుక ఉన్న నమ్మలేని నిజాలు … అసలు నమ్మలేరు

జూనియర్ ఎన్టీఆర్ అంటే కొడాలి నానికి చాలా ఇష్టం. స్టార్ హీరో అవుతాడని బలంగా నమ్మిన నాని మొదట్లో సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ ఆతర్వాత సాంబ మూవీ తీసాడు. ఇక వల్లభనేని వంశీ పెద్ద ఎన్టీఆర్ కే కాకుండా తారక్ కి కూడా అభిమాని. ఇక ఆది సినిమాతో యాక్షన్ హీరోగా చేసిన వివి వినాయక్. ఈ ముగ్గురూ కల్పి తారక్ తీసిన సినిమా అదుర్స్. ఈ సినిమాలో కామెడీలో బ్రహ్మానందం, తారక్ పోటీ పడ్డారు. ఎన్టీఆర్ కి భరోసా, విజయం రెండూ ఇచ్చిన మూవీ ఇది. నిజానికి ఈసినిమా ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసారు. బాంబ్ బ్లాస్ట్ లు,టాటా సుమోలు పేలడం వంటివి ఉండకూడదు. కామెడీతో కమర్షియల్ హంగులు జోడించాలి. మాస్ యాక్షన్ నుంచి కామెడీ ట్రాక్ వైపు తారక్ ని తీసుకురావడం కోసం సరైన కథ కావాలని చేసిన ప్రయత్నంతో 4 నెలలు గడిచాయి.

సాంబ,అది లకు పోలిక లేకుండా వుండాలని చేస్తున్న ప్రయత్నంలో దుర్గయ్య పేరిట ఓ సినిమా అనుకున్నా వర్కవుట్ కాలేదు. ఇక దశరధ్ ,వినాయక్ కూర్చుని పోలీస్ పాత్రతో కథ రెడీ చేసారు. తారక్ కూడా ఒకే అన్నాడు. కానీ ఎక్కడో తేడా. దీంతో మస్కా రైటర్ ఓ లైన్ కొత్తగా తీసుకొచ్చాడు. అదీ కుదరలేదు. తారక్ ఇచ్చిన డేట్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయక్ కి టెన్షన్. ఈలోగా కోన వెంకట్ కలవడం,ఓ కథ చెప్పడంతో వినాయక్ కనెక్ట్ అయ్యాడు. కవలపిల్లలు డ్యూయల్ రోల్. ఒకరు పిరికి,ఒకరు డేరింగ్. కామెడీ డాన్ ని ఇద్దరూ ఎలా భరతం పట్టారనేది కథాంశం. పిరికివాడుగా పూజారి క్యారెక్టర్ మారిస్తే ఎలా ఉంటుందన్న వినాయక్ సూచనతో సింహాచలం దేవస్థానం పూజారి గారబ్బాయి ని గుర్తుచేసుకుని కథ మార్పులు చేర్పులు చేసారు.

చారి గెటప్ కోసం ఫోటో సెషన్ వినాయక్ పెట్టాడు. అప్పుడు ఒకే అయింది. నయనతార , షీలా హీరోయిన్స్ గా ఒకే. బాలీవుడ్ ఆర్టిస్ట్ మంజ్రేకర్ సెలెక్ట్. నల్లమలుపు బుజ్జి ప్రొడక్షన్ వర్క్. 2008ఏప్రియల్ 23న హైదరాబాద్ ఫిలిం క్లబ్ లో షూటింగ్. చారి గెటప్ లో తారక్ సిద్ధమయ్యాడు. తొలిషాట్ లో యాక్టింగ్ తో వినాయక్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది. అయితే సెకండాఫ్ రెడీ కాకుండానే షూటింగ్ వలన టెన్షన్ ఉంది. ఈలోగా గోపీ మోహన్ సాయంతో కోన మరో వెర్షన్ రెడీ చేస్తున్నాడు. ఈలోగా 2009ఎన్నికలు వచ్చేసాయి. దీంతో ప్రచారానికి తారక్ వెళ్లడంతో అదుర్స్ కి బ్రేక్ ఎక్కువే పడింది. అయితే మార్చి 27న ప్రచారం ముగించుకు వస్తుంటే పెద్ద ప్రమాదం అనే న్యూస్. తారక్ ని హాస్పిటల్ లో చేర్చారు. పక్కటెముకలు విరగడంతో 6నెలలు విశ్రాంతి. అయినా మునిపటిలా లేవలేడని, డాన్సులు చేయలేడని టాక్స్ వినిపించడంతో తారక్ లో కసి పెరిగింది. గాయాలు పచ్చిగానే ఉన్నా రామోజీ ఫిలిం సిటీ లో క్లైమాక్స్ సాంగ్ కి తారక్ వచ్చేసాడు. నొప్పులు వస్తున్నా సరే,తారక్ స్టెప్పులు వేసాడు. టాబ్లెట్స్ కూడా వేసుకున్నాడు. మొత్తానికి ఎన్నో వేదనలు, అవరోధాలు అధిగమించి 2010జనవరి 13న థియేటర్లలోకి వచ్చేసిన అదుర్స్ కి సూపర్ రెస్పాన్స్ .