Kitchen

ఎంతో రుచిగా ఉండే మఖానా (తామర గింజలు) కర్రీ సింపుల్…

కావలసినవి పదార్థాలు:
తామర గింజలు – కప్పు
పచ్చి బఠాణీ – అరకప్పు
ధనియాల పొడి – టేబుల్‌స్పూన్‌
కారం – రెండు టీస్పూన్లు
పసుపు – అర టీస్పూన్‌
గరంమసాలా – టీస్పూన్‌
ఉల్లిపాయ – ఒకటి
పావు టీస్పూన్‌- జీలకర్ర‌
టొమాటో ప్యూరీ – ఒక కప్పు
నూనె – రెండు టేబుల్‌స్పూన్లు
ఉప్పు – తగినంత
కొత్తిమీర – గార్నిష్‌ కోసం

తయారీ విధానం

పేస్టు తయారు చేయుటకు
ఉల్లిపాయ – ఒకటి
వెల్లుల్లి – ఐదు రెబ్బలు
జీడిపప్పు – ఐదు పలుకులు
గసగసాలు – ఒక టీస్పూన్‌
అల్లం – చిన్నముక్క
నూనె – సరిపడా

ముందుగా పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ తయారీ కోసం పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. బాగా వేగిన తరువాత స్టవ్‌ పైనుంచి దింపాలి. గసగసాలు, జీడిపప్పు వేసి కలపాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

అదే పాన్‌లో తామరగింజలు వేసి చిన్నమంటపై వేగించాలి. కాసేపు వేగిన తరువాత ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టాలి.పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత రెడీ చేసి పెట్టుకున్న పేస్టు వేసి సిమ్ లో 2 నిమిషాల పాటు వేగించాలి. ఆ తరవాత టొమాటో ప్యూరీ, కారం, ధనియాలపొడి, పసుపు వేసి కలపాలి.

మూతపెట్టి సిమ్ లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. బఠాణీలు వేసి తగినంత ఉప్పు చల్లుకుని కొంచెం నీళ్లు పోసి మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి.ఇప్పుడు వేగించి పెట్టుకున్న తామర గింజలు వేయాలి. చిన్నమంటపై కొంచెం సేపు ఉడకనివ్వాలి. చిక్కటి గ్రేవీ తయారవుతుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపాలి. ఈ కూరచపాతీలోకి లేదా పులావ్‌లోకి రుచిగా ఉంటుంది.