ఎన్ని ప్లాప్ లు వచ్చిన రూట్ మార్చని రవితేజ…ఎందుకో తెలుసా ?
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్నా చితకా పాత్రలు వేస్తూ,అనూహ్యంగా హీరో రేంజ్ కి చేరుకొని,స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకెళ్లాడు. విక్రమార్కుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఉన్నాయి. కొంచెం వెటకారం,కొంచెం కామెడీ జోడించి కమర్షియల్ ఫార్ములాలతో కెరీర్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఎక్కడో తేడా కొట్టింది.
నిజానికి మాస్ మూవీస్ తో మార్కెట్ పెంచుకున్నాడు. ఎంత ట్రై చేసినా రవితేజకు హిట్ పడడంలేదు. దాంతో మార్కెట్ డౌన్ అయింది. అయితే రొటీన్ కి భిన్నంగా ఆలోచించడం లేదని,ఒకే రూట్ లో వెళ్తూ ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నాడని విమర్శకులు విశ్లేషణ. రెగ్యులర్ ప్లాప్ లు వస్తున్న రవితేజ జోనర్ మార్చకుండా కమర్షియల్ తరహాలోనే వెళ్తున్నాడు.
గోపీచంద్ మలినేని తో చేస్తున్న క్రాక్,రమేష్ వర్మ డైరెక్షన్ లో కమిట్ అయిన కిలాడి కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలోనే వెళ్తున్నాయి. రవితేజ కు మూడేళ్ళుగా హిట్ రావడం లేదు. రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్,అమర్ అక్బర్ అంథోని ఇలా అన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఇలా అయితే సక్సెస్ కొడతాడా లేక తర్వాత అయినా తీరు మారుస్తాడా అనేది వేచి చూడాలి.
