Movies

సఖి మూవీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తీసిన సఖి మూవీ ఎంతటి హిట్ మూవీయో తెల్సిందే. దీనివెనుక చాలా కసరత్తు జరిగింది. దిల్ సే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం ఉండగా, టీ బ్రేక్ లో బాల్కనీలో కూర్చుని చూస్తుంటే, ఓ ప్రేమ జంట రివ్వున బైక్ పై దూసుకెళ్తున్నారు. ప్రేమ అనేది ఓ మ్యాజిక్ . ఎప్పుడూ ఒకేలా ఉంటుందా ఇలా మణిరత్నంలో ఆలోచనలు మొదలయ్యాయి. అయితే ప్రేమ పెళ్లి వరకూ వెళ్లడమే చూపిస్తున్నారు. కానీ పెళ్లి తరువాత ఎదురయ్యే సమస్యలు,ఇబ్బందులు అన్నీ ఉండాలి. అందుకే రైటర్ సుజాతకు మణిరత్నం ఫోన్ చేసి, విషయం చెప్పాడు. నిజానికి ఆ రైటర్ మహిళకాదు,పురుషుడే. ఆయన ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీరు. కలం పేరు సుజాత. మణిరత్నం కాన్సెప్ట్ విని బాగుందన్నారు. అంతకు ముందు తమిళంలో తీసిన ఇరువర్,తెలుగులో ఇద్దరు మూవీ ఎక్కడో తేడా కొట్టింది. దాంతో కొన్నాళ్ళు దూరంగా ఉన్నాడు. నిజానికి ఎంబీఏ చేసిన మణిరత్నం సినిమాల్లోకి వచ్చాడు.

ప్రఖ్యాత స్క్రీన్ ప్లే రైటర్ సెల్వరాజ్ ని పిలిచి స్టోరీ పై మణిరత్నం కసరత్తు స్టార్ట్ చేసాడు. ఇక మణిరత్నం ప్రతిసినిమాలో కంటిబ్యుషన్ ఉండే భార్య సుహాసిని కూడా ఈ స్క్రిప్ట్ లో జోక్యం ఉంది. సినిమాలో హీరో పేరెంట్స్, హీరోయిన్ పేరెంట్స్ కలుసుకునే సీన్ సుహాసిని ఇచ్చిన ఐడియా. అంతేకాదు ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లడం,తండ్రి చనిపోయాక హీరోయిన్ తల్లిని చూడ్డానికి వెళ్లే సీన్,అలైపుర సాంగ్ సన్నివేశం ఇవన్నీ సుహాసిని క్రెడిట్ అని చెప్తారు. తమిళంలో అలై పోలైత్తే పేరు పెట్టగా, తెలుగులో సఖి అని పెట్టారు. అంతకు ముందు ఇరువర్ మూవీకి పిలిచి ,సెట్ అవ్వలేదని పంపేసిన మాధవన్ ని సఖి కోసం మణిరత్నం పిలిచి హీరో వేషం ఇచ్చేసారు. హీరోయిన్ గా ఓ సింగర్ ని అనుకున్నా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన శాలిని పై దృష్టిపడింది. వెంటనే ఒకే చేసేసారు. తల్లి పాత్రకోసం జయసుధ, మరో పాత్రకు ఖుష్బూ కూడా ఒకే అయ్యారు. ఇక కీలక పాత్రకు అరవింద్ స్వామి సెట్ అయ్యాడు.

ఎడిటింగ్ కి శ్రీకర ప్రసాద్,కెమెరా పిసి శ్రీరామ్ సెలెక్ట్. ఇక మ్యూజిక్ ఏ ఆర్ రెహ్మాన్. దీంతో సైలెంట్ గా మణిరత్నం షూటింగ్ స్టార్ట్ చేసేసారు. చెన్నై,ఆగ్రా, పోర్ట్ బ్లేయిర్,అన్నీ బ్యూటీ ఫుల్ లొకేషన్స్ ఎంచుకుని షూటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్ళిపాటకు సుహాసిని ఫ్యామిలీ మెంబర్స్,బంధువులు వచ్చారు. వాళ్ళ మధ్య మణిరత్నం సిగ్గుపడుతూనే సాంగ్ పూర్తిచేసాడు. చాలా కష్టపడి సీన్స్ తీశారు. తెలుగు వెర్షన్ పాటలన్నీ వేటూరి రాసారు. శ్రీరామకృష్ణ తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసారు. తెలుగు హక్కులను ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నారు. ప్రేమ జంట పెళ్ళయాక ఎలా ఉంటారో చెప్పిన ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. జానకి పాడిన పాట సూపర్. పిసి శ్రీరామ్ కి నేషనల్ అవార్డు . డిటిఎక్స్ చేసిన వ్యక్తికీ అవార్డు. అందుకే సఖి మూవీ ఎప్పటికీ మరపురాని మూవీయే.