Movies

రామ్ చరణ్ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.. కారణం ఇదే

చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే కరోనా కారణంగా సినిమాకు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ భార్య ఉపాసనతో ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళితో సినిమా తర్వాత రామ్ చరణ్ మరో సినిమాకి కమిట్ కాలేదు. రాంచరణ్ దగ్గరికి ఒక యువ దర్శకుడు వెళ్లి కథ చెప్పటానికి ప్రయత్నం చేస్తే ఇంట్రెస్ట్ లేదని పంపేశాడు అట. రామ్ చరణ్ కథలను వినటానికి కూడా ఆసక్తి చూపడం లేదట.

ఈ విషయం తెలిసిన సినీ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఆలోచన ఏమిటి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. రామ్చరణ్ చెబితే అర్థమవుతుంది. మరోపక్క ఎన్టీఆర్ వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో మెగా అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. రామ్ చరణ్ కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చే వరకు ఇటువంటి ఊహాగానాలు తప్పవు. ఎన్ని సినిమాలకు కమిట్ అయిన కరోనా తగ్గేవరకు షూటింగ్స్ కి రావటానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టి మెగా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు.