శ్రీహరి బయోపిక్ రావటానికి సిద్ధం అవుతుందట…శ్రీహరిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా ?

అవుననే వినిపిస్తోంది.. ఇందుకు సంబంధించి కొన్ని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న శ్రీహరి క్యాన్సర్ తో హఠాత్తుగా ఈలోకం నుంచి వెళ్ళిపోయాడు. ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా జనం చేత మంచి అన్పించుకున్న రియల్ హీరో శ్రీహరి.

ఇక ఇండస్ట్రీలో బయోపిక్స్ సీజన్ కూడా నడుస్తోంది. ఇప్పటికే తెలుగులో మహానటి పేరిట సావిత్రి జీవిత సంఘటనలను డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కుమార్తె స్వప్నదత్ నిర్మించిన ఈమూవీ కాసుల వర్షం కురిపించింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ పేరిట బాలయ్య రెండు పార్టులుగా తీసిన సినిమా డిజాస్టర్ అయింది.

ఇక రియల్ హీరో శ్రీహరి బయోపిక్ ని ఆయన సతీమణి డిస్కో శాంతి తెరకెక్కించాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కొడుకునే హీరోగా పెట్టి ఈ మూవీ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. శ్రీహరి చిన్ననాటి సంఘటనలను కూడా ఇందులో చూపించనున్నట్లు టాక్. కాగా వైస్సార్ పాదయాత్ర నేపధ్యంగా తెరకెక్కిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజసేక్షర రెడ్డి బయోపిక్ కూడా ఓ మాదిరిగా టాక్ తెచ్చుకుంది. ఇంకా పలువురి బయోపిక్స్ రాయబోతున్నాయి. క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి,దివంగత నటి ఆర్తి అగర్వాల్ బయోపిక్స్ కూడా వస్తున్నాయని వినిపిస్తోంది.