Politics

అంబానీ కోడళ్ల మధ్య ఈ తేడాలను మీరు గమనించారా…అయితే వెంటనే చూసేయండి

పారిశ్రామిక దిగ్గజం ధీరూభాయ్ అంబానీ ఫ్యామిలీ డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది. ఆయన ఇద్దరు కొడుకులు ముఖేష్ అంబానీ,అనిల్ అంబానీ ఇంకా డిఫరెంట్ గా ఉంటారు. ఇదే కుటుంబానికి చెందిన టీనా అంబానీ,నీతా అంబానీ ల మధ్య కూడా చాలా తేడా ఉంటుంది. టీనా అంబానీ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటె, నీతా అంబానీ మీడియాలో పాపులర్ అయ్యారు. టీనా .. అనిల్ అంబానీ ని వివాహం చేసుకోగా, నీతా… ముఖేష్ అంబానీ ని పెళ్లాడింది.

పెళ్లయ్యాక అంబానీల జీవనం పూర్తిగా మారిపోయింది. టినూ అంబానీ మొదట్లో బాలీవుడ్ నటి. 1975లో అంతర్జాతీయ థీమ్ థీసిస్ పోటీలో భారత్ తరపున పాల్గొని అవార్డు గెలిచింది. దాదాపు 35మూవీస్ లో చేసింది. ఈమె అందం,ఫ్యాషన్ అనిల్ అంబానీని ఆకర్షించడంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలకు దూరమై,గ్లామర్ ప్రపంచానికి దూరంగా జరిగింది.

నీతా అంబానీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇల్లు గడవడానికి 800రూపాయల వేతనానికి ఒక ప్రాధమిక పాఠశాల టీచరుగా పనిచేసేది. ఒకసారి అంబానీ ఇంట్లో వేడుకకు నీతా డాన్స్ చేసింది. ఆమెను చూడగానే ధీరూభాయ్ అంబానీ తన కోడలిగా చేసుకోవాలని నిర్ణయించారు. పెళ్లయ్యాక ఫ్యాషన్ వైపు మళ్లడమే కాదు, అంబానీ ఫ్యామిలీ వ్యాపారాన్ని కూడా చక్కబెట్టింది. నీతా, ముఖేష్ అంబానీ కల్సి రిలయన్స్ ఫౌండేషన్ స్థాపించారు. ఫౌండేషన్ చైర్ పర్సన్ గా ఉంటూ ముంబయి ఇండియన్స్ టీమ్ యజమానిగా ఉన్నారు. నీతా అంబానీ పిల్లలు అనంత్ అంబానీ ,ఆకాష్ అంబానీ.