పూరీ తమ్ముడు గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా ?

డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎన్నో హిట్ మూవీస్ తో చెలరేగిపోయాడు. ఈ మధ్య కాస్త వెనకబడ్డా ఇస్మార్ట్ శంకర్ తో సత్తా చాటాడు. ఇక 143మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పూరి తమ్ముడు సాయిరాం శంకర్ మొదట్లో అన్నయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. పవన్ కళ్యాణ్ తో తీసిన బద్రి నుంచి నాగార్జున తీసిన శివమణి వరకూ అన్నయ్య వెంట ఉన్నాడు. ఆతర్వాత హీరో అవ్వాలనే కోరిక బయట పెట్టడంతో అన్నయ్య పూరి ఎంకరేజ్ చేసాడు.

హీరోగా మారిన శంకర్ కి టాలెంట్ ఉన్నా కథల విషయంలో తేడా కొట్టడంతో వరుస ప్లాప్ లు చవిచూశాడు. శంకర్ లో యాక్టింగ్ టాలెంట్ ఉండబట్టే కృష్ణవంశీ తీసిన డేంజర్ మూవీలో ఛాన్సిచ్చాడు. ఈ మూవీలో మితిమీరిన అభిమానిగా చేసిన నటన ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. బంపర్ ఆఫర్ లాంటి హిట్ ఉన్నా తర్వాత హిట్ అంటూ లేదు. కొత్తగా రెండు సినిమాల్లో హీరోగా చేసున్నప్పటికీ లాక్ డౌన్ వలన వాయిదా పడ్డాయి. వీటిని ఎలాగైనా పూర్తిచేసి ఈ ఏడాది చివరకు విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు శంకర్.

ఇక అన్నయ్య పూరి అంటే శంకర్ కి వల్లమాలిన ప్రేమ, అభిమానం. అంతకు మించిన భక్తి ,గౌరవం కూడా ఉన్నాయి. ప్రొడ్యూసర్ కి చెప్పిన ప్రకారం అనుకున్న సమయానికి మూవీ చేసి ఇవ్వడం అన్నయ్య నైజమని శంకర్ చెబుతున్నాడు.అంతేకాదు, ఆర్టిస్టులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ప్రత్యామ్నాయంగా పక్కా ప్లానింగ్ తో సినిమా అనుకున్న టైం కి పూర్తిచేయడం అన్నయ్య పూరికి అలవాటని శంకర్ అంటున్నాడు. దర్శకత్వ శాఖలో పనిచేసినప్పటికీ కథల విషయంలో శ్రద్ధ చూపకుండా హీరోగా ఎలా ఉండాలన్న దానిపై దృష్టి ఎక్కువ పెడతానని శంకర్ అంటున్నాడు.