Movies

పోసాని కృష్ణ మురళి కొడుకు ఎలా ఉంటాడో తెలుసా? అయన కూడా టాలీవుడ్ ప్రముఖుడే

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు రచయితలుగా వచ్చి నటులై పోతారు. కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వచ్చి హీరోలైపోతారు. చిన్న నటులైనా, పెద్ద నటులైనా సరే,తమదైన నటనతో అలరిస్తారు. ఇక ఒక్క ఛాన్స్ వస్తే చాలు వెండితెరపై దుమ్ము దులిపేయాలని ఎదురుచూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఓకే యాక్టర్ ని చూస్తే, డైలాగ్ రాసినట్టు చెబుతాడా సొంతంగా చెప్పేస్తాడా అనిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్ మీద హడావిడిగా తింగరిగా మాట్లాడుతూ కనిపిస్తాడు. అలాగని అల్లాటప్పాగా డైలాగ్ ఉండదు. ఆలోచింపజేసేలా ఉంటుంది.

సపోర్టింగ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి,తర్వాత డైలాగ్,స్క్రిప్ట్ రైటర్ గా మారాడు. రాజా అని అందరిని ముద్దుగా పిలిచే ఆనటుడే పోసాని కృష్ణ మురళి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన రాణించిన వాళ్ళల్లో పోసాని ఒకరు. పరుచూరి బ్రదర్స్ దగ్గర వందకు పైనే సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా పనిచేసిన పోసాని,ఆతర్వాత ధర్మక్షేత్రం,గాయం లాంటి మూవీస్ తో రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసారు. సపోర్టింగ్ యాక్టర్ గా కూడా ధర్మక్షేత్రం మూవీలో కనిపించాడు. పవిత్ర బంధం,గోపాల గోపాల,అ ఆ ,బాపు బంగారం,ఇజం ఖైదీ నెంబర్ 150,డీజే,అత్తారింటికి దారేది ఇలా చాలా సినిమాల్లో తన నటనతో అదరగొట్టాడు.

టెంపర్ లాంటి సినిమాల్లో కూడా తనదైన నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరైన పోసాని సపోర్టింగ్ ఆర్టిస్టుల్లో చెప్పుకోదగ్గ నటుడిగా మారారు. ఇక హీరోగా కూడా చేసాడు. అయితే ఇతడి కొడుకు కూడా సినిమా రంగానికి చెందిన వాడే. తండ్రిలాగానే డైలాగ్ రైటర్ గా సినీ జీవితం ప్రారంభించి , ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు మూవీతో డైలాగ్ రైటర్ ,నటుడిగా అడుగుపెట్టాడు. తండ్రికి తగ్గ నటుడిగా,రైటర్ గా రాణిస్తాడని అందరూ అంటున్నారు.