Movies

యమలీల సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందో ?

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో కమెడియన్ అలీ హీరోగా ఎంట్రీ ఇస్తూ తీసిన యమలీల మూవీ అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. తల్లి సెంటిమెంట్ తో మురిపించి ,ఏడిపించిన ఈ సినిమా ఎప్పటికీ పదిలమే. కోటి రూపాయలతో నిర్మించిన ఈ మూవీ 10కోట్ల దాకా కలెక్ట్ చేసింది. 40సెంటర్స్ లో వంద ఆడింది. సిద్దిపేటలో తొలి 50రోజుల సినిమాగా నిల్చింది. 50రోజుల వేడుకకు యూనిట్ ని సన్మానించగా, అప్పట్లో మంత్రి గా ఉన్న ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఇక వందరోజుల వేడుక స్టార్ హోటల్ లో చేయగా, కృష,వెంకటేష్, బాలయ్య తదితరులు వచ్చారు. ఈసినిమా వెనుక చాలా పెద్ద కథ ఉంది. మనిషా ఆడియో కెసెట్స్ వ్యాపారం చేసే అచ్చిరెడ్డి, కిషోర్ రాఠీ లు ఎస్వీ కృష్ణారెడ్డి తో కల్సి మనీషా ఫిలిమ్స్ నెలకొల్పారు. తొలిసినిమా కొబ్బరి బొండాం మూవీ తీశారు. కథ,స్క్రీన్ ప్లే, పాటు,సంగీతం కూడా కృష్ణారెడ్డి అందించిన ఈమూవీ కి రవితేజ కాట్రగడ్డ డైరెక్షన్ చేసారు. ఈ మూవీ మంచి హిట్ అయింది.

తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ తీశారు. దీనికి ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ చేసారు. ఇది కూడా అనూహ్య విజయం అందుకుంది. తర్వాత మాయలోడు సూపర్ హిట్. మనీషా సంస్థ ,రెండు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా కృష్ణారెడ్డి ఎదిగాడు. ఆతరువాత సూపర్ కృష్ణ హీరోగా తీసిన నెంబర్ వన్ మూవీ బంపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ సమయంలోనే కృష్ణారెడ్డికి తదుపరి మూవీ గురించి ఆలోచన వచ్చింది. యమలోకంలో ఉండే బ్రహ్మ రాసిన చిట్టా భూలోకం మీద పడితే, ముందే జాతకం తెలిస్తే, అనే ఐడియా వచ్చింది. దీనికి అచ్చిరెడ్డి సూపర్ అని కామెంట్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ దివాకర్ బాబు తదితరులతో పంచుకోగా బాగుందన్నారు. నెంబర్ వన్ సెట్ లో తర్వాత సినిమా ఏంటని కృష్ణ అడగ్గా,కృష్ణారెడ్డి కథ కితాబిచ్చారు. కొత్త హీరో అయితే బాగుంటుందన్నారు. మహేష్ అయితే బాగుంటుదని అయితే ప్రస్తుతం స్టడీ కారణంగా నాలుగేళ్లవరకూ కుదరదు అని కూడా కృష్ణ అనేసరికి కథపై ఇంకా నమ్మకం కలిగింది. మరీ కొత్తవాడు కాకుండా ఎవరిని చూడాలనే ఆలోచనతో అలీ మైండ్ లోకి వచ్చాడు. తర్జన భర్జన తర్వాత అలీ ఒకే.

ఇక అలీ కి విషయం తెల్సి ఎగిరి గంతేసాడు. కృష్ణారెడ్డి మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సౌందర్య ని హీరోయిన్ గా ఓకే చేసారు. అయితే అలీ పక్కన చేస్తే గ్రాఫ్ పడిపోతుందని మిగిలిన వాళ్ళు భయపెట్టడంతో సౌందర్యకు జ్వరం వచ్చేసింది. విషయం ఆమె తండ్రి ద్వారా తెలుసుకుని , తెలివిగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి,ఇంద్రజను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. యముడిగా సత్యనారాయణ గ్రీన్ సిగ్నల్. చిత్రగుప్తునిగా బ్రహ్మానందం ఫిక్స్. హీరో తల్లి పాత్రకోసం మంజు భార్గవి ఒకే చెప్పేసారు. కామెడీ రోల్ కి తనికెళ్ళ భరణి ఒకే. ఇక నెంబర్ వన్ సూపర్ హిట్ అవ్వడంతో ఇందులో స్పెషల్ సాంగ్ కి కృష్ణ ఒకే చెప్పారు. యముడికి ఒక సాంగ్. మొత్తం సాంగ్స్ రికార్డింగ్ అయ్యాయి. దివాకర్ బాబు మాటలతో పూర్తి స్క్రిప్ట్ రెడీ. అన్నపూర్ణ స్టూడియోలో అలీ తొలిసన్నివేశం సూపర్. దాంతో షూటింగ్ జెట్ స్పీడ్ లో వెళ్ళింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొన్నారు. 1994ఏప్రియల్ 28న మూవీ50పింట్స్ రిలీజయింది. మెల్లగా జనానికి చేరిన ఈ మూవీ100కు పైనే ప్రింట్స్ తో సూపర్ హిట్ కొట్టింది.