శుభలేఖ సుధాకర్ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా ?
సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నటులు,నిర్మాతలు,దర్శకులు, గీతరచయితలు .. ఇలా చాలామంది ఉంటారు. అలా సినిమా పేరునే ఇంటిపేరుగా వాడుకలోకి వచ్చేసిన నటుల్లో శుభలేఖ సుధాకర్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శుభలేఖ సినిమాలో చేసిన సుధాకర్ అప్పటినుంచి ఆ సినిమాయే ఇంటిపేరుగా చెలామణిలోకి వచ్చేసాడు. తెలుగు, తమిళ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుని, సినిమాల్లో నటిస్తూనే సీరియల్స్ లో కూడా సత్తా చాటుతున్నాడు. 1982లో కళాతపసివి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించిన శుభలేఖ మూవీతో అడుగుపెట్టిన సుధాకర్ ఆతర్వాత వెనుదిరిగి చూడలేదు.
సితార,మంత్రిగారి వియ్యకుండు,లేడీస్ టైలర్,స్వాతి ,స్రవంతి,ప్రేమించు పెళ్లాడు,వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. పాజిటివ్ షేడ్స్ లోనే కాకుండా నెగెటివ్ షేడ్ లో కూడా నటించి గుర్తింపు పొందాడు. దాదాపు 100సినిమాల్లో చేసిన శుభలేఖ సుధాకర్ అప్పటి హీరోలు చిరంజీవి,బాలయ్య,వెంకటేష్,నాగార్జున లతో పాటు ఈనాటి యంగ్ హీరోలందరితో కల్సి నటించాడు. ఇంకా నటిస్తున్నాడు. నటుడిగా మంచి కెరీర్ సాగుతున్న నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఏనాడు బాలు బావమరిదిగా ఇండస్ట్రీలో చెప్పుకోకుండా సొంత టాలెంట్ ని నమ్ముకున్నాడు. నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా శుభలేఖ సుధాకర్ కూడా సత్తా చాటుకున్నాడు. ఇక శుభలేఖ సుధాకర్ దంపతులకు ఒకే కొడుకు. పేరు శ్రీకర్. ఎంబీఏ చేసి, హైదరాబాద్ లో ఒక మీడియా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అసలు సినిమా ఇండస్ట్రీ లోకి రావడం ఏమాత్రం ఇష్టంలేని శ్రీకర్ అచ్చం గతంలో శుభలేఖ సుధాకర్ ఎలా ఉండేవాడో అలానే ఉంటాడు. ఎప్పుడూ కనిపించని శ్రీకర్ ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.