Movies

అష్టా చెమ్మా సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలుసా…?

విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో బి. ఏ. ఇంగ్లిష్ లిటరేచర్ చేసే రోజుల్లో లైబ్రరీలో మొత్తం ఇంగ్లీషు పుస్తకాలను ఇంద్రగంటి మోహన్ కృష్ణ అవలీలగా చదివేశాడు. ఇక ఫిలిం అండ్ వీడియోలో కోర్సు రెండేళ్లు చేసి వచ్చిన ఇంద్రగంటి రోజూ నిద్రపోయే ముందు బుక్ చదవడం అలవాటు. ఓరోజు పుస్తకాల అరలో చేయిపెడితే ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’బుక్ తగిలింది. అంతకుముందు ప్రొఫెసర్ చెప్పడంతో చదివిన పుస్తకమే అయినా మళ్ళీ చదివాడు. ఈ కాన్సెప్ట్ తో మూవీ చేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రహణం తర్వాత రాజా ,భూమిక కాంబోలో మాయాబజార్ మూవీ. కానీ నిరాశ తప్పలేదు. రామ్ మోహన్ ఎంబీఏ చదివి సురేష్ ప్రొడక్షన్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు.

ఇక మోహన్ కృష్ణతో ముందునుంచీ పరిచయం ఉండడంతో ఓ సినిమా చేద్దాం అని రామ్ మోహన్ చెప్పాడు. దాంతో ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్’ కాన్సెప్ట్ తో మూవీ గుర్తొచ్చింది. వరల్డ్ వైడ్ పాపులర్ గా నిలిచిన నాటకం ఇది. హీరో పేరు జాక్. పల్లెటూరు వ్యక్తి. లైఫ్ బోర్ కొట్టడంతో అప్పుడప్పుడు లండన్ వెళ్లి వస్తుంటాడు. అక్కడ అతడి పేరు ఎర్నెస్ట్. వేండొలిన్ అనే అమ్మాయికి ఎర్నెస్ట్ అంటే పిచ్చి. ఫలితంగా ఇద్దరూ ప్రేమలో పడతారు.

సేమ్ ఇదే ఇతివృత్తంతో కథ రెడీ. హీరో పేరు రాంబాబు. పల్లెటూరు వాడే అయినా హైదరాబాద్ వెళ్లి వస్తుంటాడు. రాంబాబుకి మరోపేరు ఏమిటబ్బా అని ఆలోచిస్తుంటే,పోకిరి హిట్ తో మహేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. అందుకే మహేష్ పేరు వాడేశారు. హీరోగా గోపీచంద్,ఉదయ్ కిరణ్ లను అడిగితె నో చెప్పేసారు. ఇక సెకండ్ హీరోయిన్ వరలక్ష్మిగా కలర్ స్వాతి సెలక్ట్. హీరో ఎవరని అనుకుంటుంటే,నందిని రెడ్డి వచ్చి ఓ పేరు చెప్పింది. అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. అతడే నాని. ఒకే చేసేసారు.

మ్యూజిక్ కళ్యాణ్ మాలిక్ ఇలా అన్ని సెట్ అయ్యాక ముందుగా అనుకున్న హీరోయిన్ భూమిక కు పెళ్లి ఫిక్స్ కావడంతో దాంతో సెకండ్ లీడ్ అనుకున్న నాని,స్వాతి లను మెయిన్ లీడ్ గా చేయాలని రామ్ మోహన్ సూచనతో ఒకే చేసేసారు. ఇక ఆనంద్ పాత్రకు అవసరాల శ్రీనివాస్ ఒకే. మోహన్ కృష్ణ అత్తగారి సూచనతో సీరియల్ నటి భార్గవిని సెకండ్ హీరోయిన్ గా మేకప్ టెస్ట్ చేయకుండానే సెలెక్ట్ చేసారు. హలొ హలొ ఓ అబ్బాయి టైటిల్ గా అనుకున్నారు కానీ కుదరలేదు. కథ కంచికి అనే టైటిల్ నో. ఇక కళ్యాణ్ మాలిక్ నోట అష్టాచెమ్మా టైటిల్ రావడంతో ఒకే చేసారు. అమలాపురం, హైదరాబాద్ ఇలా పలుచోట్ల షూటింగ్ చేసారు.

కోటి 60లక్షల బడ్జెట్ తో టాకీపార్ట్ కి 29రోజులు,సాంగ్స్ కి 14రోజులు. సినిమా పూర్తయిన రెండు నెలలకు 2008సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ ప్రకటించాక వైజాగ్ ,విజయవాడ లలో వారం ముందు ప్రీమియర్ షో వేయాలని రామ్ మోహన్ డేర్ చేసాడు. వైజాగ్ షో సూపర్ హిట్. విజయవాడ లో సూపర్ డూపర్ హిట్. దీంతో రిలీజ్ రోజున మంచి టాక్ వచ్చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఫోన్. మా ఫ్యామిలీ అంతా చూసాం. సినిమా ఫ్రెష్ గా ఉందని చెప్పడంతో మోహన్ కృష్ణ థ్రిల్ ఫీలయ్యాడు. ఇక వరుస పెట్టి ఫోన్స్ . మరి దీనికి సీక్వెల్ ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మోహన్ కృష్ణ ఎప్పుడు తీస్తారో మరి.