మాస్క్ వల్ల వచ్చే నల్లని మచ్చలకు చెక్ పెట్టాలంటే…

కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ మా ధరిస్తున్నారు. ప్రతిరోజు తప్పనిసరిగా మాస్కు వేసుకోవాల్సిందే. బయటకు వచ్చాము అంటే మాస్కులు లేకుండా రావటం అనేది కుదరదు. ఈ విధంగా ప్రతిరోజూ మాస్క్ వాడటం వల్ల కొంతమందికి నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.

మాస్క్ వేసుకున్న కొద్దిసేపటికే ముక్కు గడ్డం చెమట పట్టి దురదలు వస్తూ ఉంటే ఉంటే అప్పుడు క్లాత్ మాస్ మానేయాలి. సర్జికల్ మాస్క్ వేసుకోవడం చాలా మంచి ఫలితాలనిస్తుంది.

మాస్కు పెట్టుకున్నాక ఆస్తమాను తీసుకోకూడదు. స్కిన్ తత్వానికి సరిపడా మాస్క్ ని ఎంచుకుని పెట్టుకోవడం ఉత్తమం. మాటిమాటికీ మాస్కు తీయడం వల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది.

ప్రతిరోజు ఒకే మాస్క్ కాకుండా నాలుగు గంటలకు ఒకసారి మాస్కు మార్చడం మంచిది. ఇలా మార్చడం వలన చర్మ సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే మాస్ కి వేసుకుని బయటకి వెళ్లి వచ్చాక ఆ మాస్క్ ని కొంతసేపు ఎండలో ఉంచాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాస్క్ కారణంగా ఎటువంటి నల్లని మచ్చలు రావు.