Movies

కింగ్ నాగార్జున కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా ?

అక్కినేని నటవారసుడిగా విక్రమ్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన టాలెంట్ తో కింగ్ నాగార్జున ఎదిగి,టాలీవుడ్ నవమన్మధుడిగా నిలిచాడు. గెస్ట్ రోల్స్,సపోర్టింగ్ రోల్స్ కూడా చేసి తన భిన్నమైన శైలి చాటుకున్నాడు. కెరీర్ మొదట్లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసిన నాగ్ 2010నుంచి ఏడాదికి ఒక్కొక్క సినిమా చేస్తున్నాడు. 1986లో విక్రమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. తర్వాత కెప్టెన్ నాగార్జున,అరణ్యకాండ మూవీస్ అట్టర్ ప్లాప్ అయ్యాయి. 1987లో దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన మజ్ను మూవీ హిట్ కొట్టింది. 1988లో కలెక్టర్ గారి అబ్బాయి కూడా మంచి హిట్ అయింది. అదే ఏడాది దర్శకేంద్రుని డైరెక్షన్ లో ఆఖరి పోరాటం కమర్షియల్ గా భారీ హిట్ గా నిల్చింది. ఆయన డైరెక్షన్ లోనే వచ్చిన జానకి రాముడు లెజెండరీ హిట్ అయింది.

తర్వాత ఏటా నాలుగైదు మూవీస్ లో నటిస్తూ వచ్చిన నాగ్ 1989లో విజయ్, విక్కీదాదా, శివ, గీతాంజలి,అగ్ని చేయగా రెండు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శివ,గీతాంజలి మూవీస్ నాగ్ కి లక్కీ ట్రెండ్ క్రియేట్ చేశాయి. 1990లో ప్రేమయుద్ధం,నేటి సిద్ధార్ధ,ఇద్దరూ ఇద్దరే, ప్లాప్ అయ్యాయి. అయితే హిందీ వెర్షన్ శివ హిట్ అయింది. 1991లో నిర్ణయం,చైతన్య,శాంతిక్రాంతి ,జైత్ర యాత్ర చేయగా, నిర్ణయం ఏవరేజ్ అయింది. 1992లో కిల్లర్,ఖుదాగవా, అంతం ,ద్రోహి,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం మూవీస్ చేయగా, కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం భారీ హిట్ అయింది. 1993లో రక్షణ,వారసుడు,అల్లరి అల్లుడు మూవీస్ చేయగా, వారసుడు మూవీ మంచి హిట్ అవ్వగా, అల్లరి అల్లుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 1994లో చేసిన మూడు సినిమాల్లో హలొ బ్రదర్ సూపర్ డూపర్ హిట్ అయింది. క్రిమినల్ క్లాసిక్ మూవీగా నిల్చింది.

ఇక 1995లో ఘరానా బుల్లోడు, సిసింద్రీ,వజ్రం మూవీస్ చేయగా మొదటి రెండు మూవీ మంచి హిట్ సాధించాయి. 96లో మూడు సినిమాలు చేయగా నిన్నే పెళ్లాడతా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 97లో అన్నయ్య భారీ విజయాన్ని అందుకుంది. రక్షకుడు, ఆవిడ మా ఆవిడే ఏవరేజ్ అయ్యాయి. 98లో సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. 99లో సీతారామరాజు,రావోయి చందమామ మూవీస్ చేయగా సీతారామరాజు హిట్ అయింది. 2000లో నువ్వొస్తావనీ,నిన్నే ప్రేమిస్తా,ఆజాద్ సినిమాలు చేసాడు. నువ్వ్వొస్తావని సూపర్ డూపర్ హిట్ అయింది. 2001లో 5సినిమాలు .. ఎదురులేని మనిషి,బావ నచ్చాడు, ఆకాశ వీధిలో స్నేహమంటే ఇదేరా మూవీస్ చేసాడు. ఏదీ విజయాన్ని నమోదు చేయలేదు.

2002లో సంతోషం,మన్మధుడు సూపర్ డూపర్ హిట్. అగ్ని వర్షం ఏవరేజ్. 2003లో చేసిన శివమణి సూపర్ హిట్. 2004లో నేనున్నాను,మాస్ మూవీస్ చేయగా రెండు హిట్ అయ్యాయి. 2005లో సూపర్ మూవీ నాగార్జునలో మరో కొత్తకోణం చూపింది. 2006లో శ్రీరామ దాసు క్లాసిక్ మూవీ. బాస్ ఐ లవ్ యు ప్లాప్. 2007లో డాన్ ఏవరేజ్. 2008లో కృష్ణార్జున ప్లాప్ ,కింగ్ మూవీ ఏవరేజ్. 2009 నుంచి తీసిన కేడీ , రగడ, ప్రయాణం,గగనం ప్లాప్. షిరిడి సాయి మహత్యం,ఢమరుకం ఏవరేజ్. 2014లో మనం మూవీ హిట్. 2016లో సోగ్గాడే చిన్ని నాయనా సూపర్ హిట్. అదే ఏడాది ఊపిరి నటన పరంగా మంచి పేరు తెచ్చింది. 2017లో ఓం నమో వెంకటేశాయ రాజుగారి గది ఏవరేజ్. 2018లో దేవదాస్ హిట్. 2019లో బ్రహ్మాస్త్ర తీసినా ఇంకా రిలీజ్ కాలేదు.2020లో వైల్డ్ డాగ్ మూవీ చేస్తున్నాడు.