Movies

“ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” సినిమా వెనక నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

బద్రీ సినిమా హిట్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాధ్ దగ్గర క్యూ కట్టిన జనం బాచి పరాజయంతో దూరంగా జరిగారు. సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే ఆదరణ లేకుంటే పలకరించడానికి కూడా ఎవరూ రారు. కె బాలచందర్ తీసిన మరో చరిత్ర మూవీ అంటే పూరికి చాల ఫేవరేట్ మూవీ. ఇందులో పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులిద్దరూ చనిపోతారు. దీనికి కొనసాగింపుగా బాలచందర్ తీసిన డాన్స్ మాస్టర్ మూవీలో ప్రేమికుల్లో ఒకరు చనిపోతే పరిస్థితి ఏమిటన్నది ఈ మూవీ ఇతివృత్తం. అదే కొండమీదికి చేరిన ఓ జంట ప్రేమలో పడితే.. భలే ఉంటుంది. దాంతో చకచకా స్క్రిప్ట్ రాసేసి,ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అని టైటిల్ పెట్టి దూరదర్శన్ కి పంపిస్తే రిజెక్ట్ అయింది. ఇంతబాగున్న కథను ఎలా రిజెక్ట్ చేసారని ప్రశ్నించుకుని ఇంకోసారి ట్రై చేద్దామని ఇదే స్టోరీని కొండచరియ టైటిల్ తో పంపితే రిజెక్ట్ అయింది. నిజానికి పవన్ తో బద్రి తీయడానికి ముందు పవన్ ని కలవడానికి చోటా కె నాయుడుకి చెప్పిన కథే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం.

తీరా పవన్ కలిసాక వేరే స్టోరీ ని పూరి చెప్పాడు. ఆలా బద్రి తీసాడు. అయితే దూరదర్శన్ నుంచి రిజెక్ట్ అయిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను పక్కనే పెట్టేసాడు. అయితే బాచి ప్లాప్ తర్వాత మూలాన పెట్టిన ఈ కథను మళ్ళీ తీసాడు. సినిమాకు తగ్గట్టు స్క్రీన్ ప్లే మార్చాడు. అదే అతడికి బ్రహ్మాస్త్రం. సుమంత్ ని కల్సి కథ చెప్పాడు. నచ్చినట్టు లేకపోవడంతో ఇంకో కథ చెప్పాడు. అదీ నచ్చలేదు. దాంతో డైలమాలో పడ్డాడు. తరుణ్ తో తీద్దామనుకుంటే, అతడి దాకా వెళ్లకుండా తల్లి రోజారమణి దగ్గరే ఆగిపోయింది. సింధూరం సినిమా దగ్గర నుంచి నీతో సినిమా చేస్తా అని రవితేజకు పూరి చెప్పేవాడు. అది గుర్తొచ్చి వెంటనే పిలిచాడు. రవితేజ వచ్చాడు. కానీ ప్రొడ్యూసర్స్ ఎగిరిపోయారు. అన్నీ రెడీగా ఉన్నా ప్రొడ్యూసర్స్ లేరు. న్యాయవాదులు కె వేణుగోపాలరెడ్డి,శేషురెడ్డి కూడా రవితేజకు మంచి ఫ్రెండ్స్. సినిమా అంటే పిచ్చిప్రేమతో ఈ మూవీ తీయడానికి ముందుకొచ్చారు.

ఇద్దరు హీరోయిన్స్ . ఒకరు ప్రత్యుష. రవితేజతో ఫోటో షూట్ అయ్యాక తమిళ సినిమా వల్ల ఈ మూవీకి బై చెప్పేసింది. ఈలోగా మోడల్స్ ఫోటోలు చూసి,బెంగాలీ అమ్మాయి నచ్చడంతో వెంటనే పూరి ఫోన్ చేసి సినిమాలో చేస్తారా అని అడిగాడు. రెండేళ్లు ముంబయిలో సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేసి చేసి,విసుగెత్తిపోయి, ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్న ఆమెకు టాలీవుడ్ లో ఛాన్స్ అనగానే ఏడుపు వచ్చేసింది. ఆమె తనూరాయ్. ఇక ఎయిర్ హోస్టెస్ నచ్చడంతో సినిమాలో చేస్తావా అని అడిగాడు.

ఆమెకు సినిమా అంటే ఇష్టం కావడంతో ఒకే చెప్పేసింది. ఆమె పేరు సమ్రీన్. ఇక చక్రి మ్యూజిక్. అన్ని సాంగ్స్ సూపర్. మళ్ళీ కూయవే గువ్వా సాంగ్ ఇంకా సూపర్. ఇప్పటికీ ఈ పాటకు ఎంతో విలువ ఉంది. 2001ఫిబ్రవరి 24న షూటింగ్ ప్రారంభం అనే యాడ్ ప్రకటనలో ‘మాకు 32కష్టాలు మా చావుకి ఎవరూ కారణం కాదు’అనే క్యాప్షేన్ కి అందరూ ఫ్లాట్ అయ్యారు. 45డేస్ లో షూటింగ్ పూర్తి. మొక్కుబడిగా బిజినెస్ అయింది. 2001 సెప్టెంబర్ 14న సినిమా రిలీజ్ రోజున మంచి టాక్ వచ్చేసింది. అపజయం తర్వాత విజయం తధ్యమని తేలింది. దాంతో పూరి బిజీ అయిపోయాడు. ఆ సినిమాతో అందరికి పేరొచ్చింది.