Movies

ఉప్పెన సక్సెస్ సాధించేనా? వేస్తున్న ప్లాన్స్ వర్క్ అవుట్ అవుతాయా ?

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో సినిమా రెడీ అవుతోంది. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ తీస్తున్న ఉప్పెన మూవీ ఇప్పటికే సాంగ్స్ తో దుమ్మురేపింది. కరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయిన ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తోంది. క్రితి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్ చేయగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్న ఈ సినిమా థియేటర్ లోనే విడుదల చేయాలని మూవీ మేకర్స్ గతంలో ప్రకటించారు.

అయితే సుధీర్ బాబు,నాని నటించిన ‘వి’ మూవీ సెప్టెంబర్ 5న ఓటిటి వేదికగా అమెజాన్ లో విడుదల అవుతోంది. దీంతో పలు సినిమాలు కూడా ఓటిటి వేదికపై రిలీజ్ చేయాలన్న భావన కలుగుతోందని అంటున్నారు. పలు ప్రచారాలు కూడా జరుగుతు న్నాయి. ఇదే సమయంలో ఉప్పెన కూడా ఓటిటి లో ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ తాజాగా నడుస్తోందని అంటున్నారు. కానీ థియేటర్ లోనే రావాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది.

అందుకే థియేటర్ లోనే విడుదల చేయాలని నిర్మాతలు కూడా ప్రస్తుతానికి కట్టుబడి ఉన్నారు. ఒకవేళ ఓటిటి లో అయితే రెండు పార్టులుగా రిలీజ్ చేయమని ఉప్పెన మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఈ అంశం ప్రస్తావించారట. ఇలా చేయడం వలన రైట్స్ తో పాటు డబుల్ ఎమౌంట్ కూడా వస్తుందని, ఆడియన్స్ కి కూడా బాగా రీచ్ అవుతుందని అంటున్నారు. రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి సరిపడా ఉప్పెన ఫుటేజ్ మేకర్స్ దగ్గర ఉందట. ఇప్పటివరకూ ఇన్ సైడ్ టాక్ గా నడుస్తున్న ఈ అంశం ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తోందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."