పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
అష్టా చెమ్మా మూవీతో తనలోని నటనను ఆడియన్స్ కి చూపించి మంచి మార్కులు కొట్టేసిన స్వాతి ఒకప్పుడు టివిలో కలర్స్ ప్రోగ్రామ్స్ తో అలరించి కలర్స్ స్వాతిగా సుపరిచితమైంది. 15ఏళ్ళ ప్రాయంలోనే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకుంది. నిఖిల్ నటించిన కార్తికేయ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక విక్టరీ వెంకటేష్ తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో వెంకీతో పోటీ పడి నటించింది. స్వామి రారా చిత్రం కూడా హిట్ కొట్టింది.
త్రిపుర,లండన్ బాబులు వంటి మూవీస్ చేసినా అవి సక్సెస్ ఇవ్వకపోవడంతో ఇక అక్కడ నుంచి ఇండస్ట్రీకి దూరమైంది. పైలెట్ వికాస్ తో రెండేళ్ల క్రితం పెళ్లయిన స్వాతి ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిందని టాక్. అయితే ప్రస్తుతం కరోనా కాలంలో సినిమాలు ఇంకా సెట్స్ మీదికి రావడం లేదు. కరోనా కేసుల పెరుగుదల చూస్తుంటే డిసెంబర్ దాకా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యేలా ఉంది. అందుకే వెబ్ సిరీస్ వైపు స్వాతి దృష్టి పెట్టిందన్న మాట వినిపిస్తోంది
ఇప్పటికే మెగాస్టార్ తనయ కూడా వెబ్ స్ట్రీమ్ లోకి అడుగుపెట్టడం నేపథ్యంలో స్వాతి కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నందున ఓ ప్రముఖ డైరెక్టర్ తో వెబ్ సిరీస్ లో చేయడానికి కమిట్ అయినట్లు వైరల్ అవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ గట్టిగానే ఉంది. దీంతో వెబ్ సిరీస్ కి, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి గిరాకీ కూడా ఉండడంతో సరైన ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్స్ కూడా వేట మొదలెట్టారు. మరి స్వాతి వెబ్ సిరీస్ కి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
