బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సింగర్ నోయల్ గురించి నమ్మలేని నిజాలు

సింగర్ నోయల్ బిగ్ బాస్ సీజన్ 4కోసం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతడి వివరాల్లోకి వెళ్తే,మిలటరీ డిఫెన్స్ అకాడెమీలో స్టడీస్ పూర్తిచేసిన నోయల్ ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ పూర్తిచేసాడు. తండ్రి డిఫెన్స్ లో పనిచేయడం వలన ఆ కోర్సు చేసాడు. తల్లి సారా చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో పెంచింది. ఇష్టమైన ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసి,తర్వాత వెబ్ డిజైనింగ్ చేసాడు.

తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇంటరెస్ట్ గా ఛాన్స్ ల కోసం చూసాడు. పల్లెల రవిశంకర్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. సంభవామి యుగే యుగే మూవీ లో స్క్రీన్ ప్లే లో మెరిశాడు. తర్వాత డైరెక్టర్ తేజ మూవీకి ఆడిషన్స్ కి వెళ్ళాడు. అక్కడ కీరవాణి ని కలిసాడు. అలా విక్రమార్కుడు మూవీలో ర్యాంప్ సాంగ్ ఆలపించి మెప్పించాడు. దాంతో రాజమౌళికి దగ్గరయ్యాడు. మంత్ర మూవీలో మహా మహా సాంగ్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు 93.5 ఎఫ్ ఎం లో పనిచేసాడు.

సుకుమార్ చేసిన కుమారి 21నుంచి నోయల్ కి మంచి బ్రేక్ వచ్చింది. అలాగే హెబ్బా పటేల్ తో కల్సి నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్ చేసినా క్లిక్ అవ్వలేదు. జి తెలుగులో సూపర్ సింగర్ కి పనిచేసాడు. జెమినిలో యాంకరింగ్ చేసాడు. సాటి సింగర్స్ తో కల్సి ఒక ట్రూప్ ఏర్పాటుచేశాడు. సొంత యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో ప్రయివేట్ సాంగ్స్ చేసాడు. ఈనేపధ్యంలో చేసిన కవర్ సాంగ్ మూడు మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో తానేంటో నిరూపించుకోవడానికి ఎంట్రీ ఇచ్చాడు.