Health

బరువు తగ్గించుకోవటానికి కొబ్బరి నూనెను వాడుతున్నారా ?

నేటి ప్రపంచంలో అడ,మగ,వయస్సు తేడా లేకుండా అందరూ బరువు సమస్యతో బాధ పడుతున్నారు. సాదారణంగా చాలా మంది బరువు తగ్గటానికి మందులు వాడటం మరియు వ్యాయామాలు చేయటం మరియు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని పదార్దాలతో బరువు తగ్గాలని ప్రయత్నం ఉంటారు. మీ వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే కొబ్బరి నూనె బరువు తగ్గటంలో సహాయపడుతుంది.కొబ్బరి నూనె బరువు కోల్పోవటంలో ఎలా సహాయపడుతుంది

మనలో చాలా మందికి జుట్టు సంరక్షణ,చర్మ సంరక్షణలో కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుందని తెలుసు. కానీ కొబ్బరి నూనె జుట్టు సంరక్షణ,చర్మ సంరక్షణకు మాత్రమే కాకుండా బరువు కోల్పోవటంలో కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనె ఎలా సహాయపడుతుందో వివరంగా తెలుసుకుందాం.

1. కొవ్వు కరిగించటానికి
కొబ్బరి నూనెలో బరువు కోల్పోవటానికి సహాయపడే మధ్యస్థ చైన్ ట్రైగ్లిజరైడ్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి జీవక్రియను సక్రమంగా జరిగేలా చూడటం మరియు జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేయటానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అయితే కొవ్వు శరీరంలో నిల్వ ఉండదు. దాంతో బరువు పెరిగే
అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కొబ్బరి నూనె వాడితే శరీరంలో కొవ్వు నిల్వ ఉండకుండా నియంత్రిస్తుంది.

2. పూర్తి అనుభూతి
కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు మనల్ని సంతృప్త అనుభూతిని కలిగిస్తుంది. అంటే కొబ్బరి నూనె తీసుకున్నప్పుడు తక్కువ ఆకలి అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఆహారం తినాలనే కోరిక తగ్గుతుంది. దాంతో క్రమంగా బరువు కోల్పోవటం మరియు బరువు పెరగటాన్ని కూడా నియంత్రిస్తుంది.

3. నిర్విషీకరణ తో బరువు కోల్పోవటం
కొబ్బరి నూనెలో యాంటి బాక్టీరియా మరియు యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉండుట వలన శరీరానికి హాని కరమైన వాటిని బయటకు పంపుతుంది. దాంతో శరీర డెటాక్సిఫికేషన్ సహజంగా బరువు నష్టంనకు ప్రోత్సహిస్తుంది.

4. పొట్ట కొవ్వు తగ్గిస్తుంది
కొబ్బరి నూనె జీవక్రియ వేగాన్ని పెంచటం మరియు ఆకలిని తగ్గించటంలో సహాయపడుతుంది. అందువలన ఖచ్చితంగా బరువు కోల్పోవటంలో సహాయపడుతుంది. అంతేకాక కొబ్బరి నూనె పెరిగిన HDL స్థాయిలను,పొట్ట బాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది.

5. కడుపు మరియు నడుము ప్రాంతంలో కొవ్వును తగ్గిస్తుంది
ప్రతి రోజు 1 ఔన్స్ కొబ్బరి నూనెను తీసుకుంటే BMI తగ్గటానికి సహాయపడుతుందని ఒక పరిశోదనలో తెలిసింది. కొబ్బరి నూనె వినియోగం వలన నడుము ప్రాంతంలో కొవ్వు తగ్గుతుంది.