Movies

పాపం నిహారిక పరిస్థితి ఇలా అయింది ఏమిటి?

మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు హీరోయిన్ గా రావటానికి ఎవరు ధైర్యం చేయలేదు. కానీ నాగబాబు కూతురు నిహారిక ఆ దైర్యం చేసింది కానీ సక్సెస్ కాలేకపోయింది. నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తాను అని చెప్పినప్పుడు మెగా హీరోలు ఎవరు సపోర్ట్ చేయలేదు. అలాగే చిరంజీవి నాగబాబు కూడా ముందడుగు వేయలేదు. ఇక ఆ తర్వాత నిహారిక పట్టుదల చూసి నాగబాబు ఓకే అన్నాడు. రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించిన లాభం లేకుండా పోయింది. మూడో సినిమా కోలీవుడ్ కి వెళ్ళింది.

ఆ సినిమాలో కాస్త బోల్డ్ పాత్రలో నటించడానికి ఓకే చెప్పింది. ఈ లోపు పెళ్లి కుదరటంతో ఆ సినిమాకి నో చెప్పేసింది. నిహారిక కు వివాహ నిశ్చితార్థం అయ్యింది. దాంతో సినిమా నుంచి నిహారిక తప్పుకుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సిందే కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. దాంతో అసలు సినిమా ప్రారంభమే కాలేదు. ఈ లోపు పెళ్లి సెట్ అవటం తో ఈ సినిమాకి నో చెప్పేసింది. ఇక ముందు ముందు సినిమాల్లో నటించడం కష్టమే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."