Beauty Tips

ముడతలను పోగొట్టే మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్ ముఖం అందాన్ని రెట్టింపు చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటే ముఖం మీద వచ్చె ముడతలను తగ్గించుకోవచ్చు. ఈ ముడతలు కారణంగా ముఖ సౌందర్యం దెబ్బతినటమే కాకుండా అకాల వృద్దాప్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖం మీద ముడతలు అనేవి వయస్సు రిత్యా సంభవించే పరిణామాలు అయినప్పటికి,డ్రై స్కిన్ వారికీ మాత్రం ముడతలు చాలా త్వరగా వస్తాయి.

ఇలాంటి చర్మం కల వారిలో చాలా చిన్న వయస్సులోనే అంటే 28 సంవత్సరాలకే ముఖం మీద ముడతలు అనేవి బయటపడతాయని,వీరికి 36 సంవత్సరాలు వచ్చేసరికి 50 శాతం ముడతలు వచ్చేస్తాయి. మాములు చర్మం కలవారికి 36 సంవత్సరాల వయస్సులో కేవలం 26 శాతం మాత్రమే ముడతలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి నుంచి తప్పించుకోవాలంటే మాయిశ్చరైజర్ ఒక్కటే పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.

వాతావరణ కాలుష్యం ముడతలు రావటానికి ఎక్కువగా దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరగటం వలన కూడా ముడతలు వస్తాయి. ధూమపానం చేసే వారిలో ముడతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిగరెట్టు త్రాగే వారిలోనే కాకుండా ఆ పొగను పిల్చె వారిలో కూడా ఈ ముడతలు చిన్న వయస్సులోనే కనపడతాయి.

ఇవే కాకుండా తీవ్రమైన ఒత్తిడి, జీవన విధానంలో అసమానతలు వీటికి మరొక కారణంగా చెప్పవచ్చు. అయితే ముడతలు పోగొట్టుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి. వీటిని పోగొట్టుకోవటానికి మార్కెట్ లో అనేక రకాల సౌందర్య సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి వలన కొన్ని దుష్పరిణామాలు కలుగుతాయి. అలా కాకుండా సిడ్ ఆయిల్ తో
మాయిశ్చరైజ్ చేసుకుంటే క్రమేపి ఈ ముడతల బారి నుండి తప్పించుకోవచ్చు. దానిమ్మ నూనె,బ్లూ బెర్రీ నూనెలలోని ఫ్యాటి ఆమ్లాలు చర్మాన్ని నునుపుగా చేయటమే కాకుండా సహజ సిద్దమైన నిగారింపును ఇస్తుంది.