బిగ్ బాస్ అబీజీత్ కి ‘అక్కినేని’ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటో తెలుస్తే నోరెళ్ళబెడతారు!!
కారోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో 4వ సీజన్ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. పక్కా కరోనా నిబంధనలు పాటిస్తూ,టెస్టులు సైతం నిర్వహించి హౌస్ లోకి కంటెస్టెంట్స్ ని అనుమతించారు. బిగ్ బాస్ లో హోస్ట్ గా కింగ్ నాగార్జున చేస్తుండగా, 16మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత ఐదు ఐదురోజులుగా బిగ్ బాస్ హౌస్ లో నానా హడావిడి చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అభిజిత్,అఖిల్, మెహబూబా , సుజాత, దివి, సూర్య కిరణ్ వీళ్లంతా ఎలిమినేషన్ జాబితాలోకి వచ్చేసారు. ఇందులో ఎవరికివాళ్లు సేఫ్ జోన్ లోకి రావడానికి అందరూ సందడి చేస్తున్నారు.
ఇందులో అభిజిత్ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో పాపులర్ గా నిల్చి, తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. బిటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి,ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. సోషల్ మీడియాలో ఇతడి ఫోటోలను చూసి ఆడిషన్స్ కి పిలిచారు. అలా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అభిజిత్ మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో మరోసారి అలరించాడు.ఆ తర్వాత సినిమాలు పక్కన పెట్టి, అతను వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టాడు. అభిజిత్ నటించిన పెళ్లి గోల 1,2,3 వెబ్ సిరీస్ లక్షల్లో లైక్స్,వ్యూస్ సొంతం చేసికుని ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై మళ్లీ కనిపించకుండా ఉన్నప్పటికీ ప్రస్తుతం బిగ్‌బాస్‌తో బుల్లితెరపై తొలిసారి అడుగు పెట్టాడు.
తన గుర్తింపు కోసం బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన అభిజిత్ ని హోస్ట్ నాగార్జున అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ అక్కినేని ఫ్యామిలీతో అనుబంధం ఉందని చెప్పాడు. నాగ్ ఆశ్చర్యపోతూ ఎలా అని అడిగాడు. కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చదివిన కిండర్ గార్డెన్(చైతన్య విద్యాలయ) పాఠశాల లోనే ఇతను కూడా చదువుకున్నాడు. అఖిల్ స్కూల్‌మేట్ మాత్రమే కాదు, అతని క్లాస్మేట్, ఫ్రెండ్ కూడా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో అమలతో కల్సి పనిచేసాడు. కాగా అభిజిత్ పూర్వీకులు తరతరాలుగా నిర్మాణ సంస్థ వ్యాపారంలో పేరుపొందారు. అయితే చార్మినార్ నిర్మాణంలో ఇతడి తాతముత్తా తలు వలస కూలీలుగా భాగం పంచుకున్నారు. అలా నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. మరి బిగ్ బాస్ లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

