బయటపడ్డ జయప్రకాశ్ రెడ్డి ఆస్థి వివరాలు…ఎన్ని కొట్లో తెలిస్తే నోరెళ్ళబెడుతారు
సినిమా ఇండస్ట్రీలో ఎంత సంపాదించినా చివరకు ఒక్క పైసా చేతిలో లేకుండా కన్నుమూసిన వారెందరో ఉన్నారు. కానీ కొందరు జాగ్రత్త పడతారు. ఇక రంగస్థలం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి,భయంకర విలనిజం పండించే విలన్ గానే కాకుండా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో అన్ని రసాలు పండించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణించడంతో సినిమా ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.
గత సంక్రాంతికి రిలీజైన సరిలేరు నీకెవ్వరూ మూవీలో రాయలసీమ యాసతో ఫ్యాక్షనిస్ట్ విలనిజం పండించి భారీ హిట్ అందుకున్న జయప్రకాశ్ రెడ్డి అన్ని రకాల నటనతో ఆడియన్స్ కి దగ్గరయ్యారు. సినిమాల్లో ఉన్నా సరే, రంగస్థలం మీద ఇష్టంతో ఎక్కడ నాటకాలు జరిగినా వెళ్లేవారు. అంతేకాదు నాటాకాల్లో నటించేవారు. ఇలాంటి మంచి నటుడి ఆస్తుల గురించి పలు వార్తలొస్తున్నాయి.
జయప్రకాష్ రెడ్డి ఆస్తుల విషయానికి వస్తే ఏడాదికి నాలుగు నుంచి 5సినిమాలు చేసేవారు. ఒక్కో సినిమాకు 50లక్షల నుంచి కోటి రూపాయల రెమ్యునరేషన్ వచ్చేదని అంటారు. హైదరాబాద్ లో విలువైన బంగ్లాలు,సొంతూరులో విలువైన ఆస్తులు ఉన్నాయని మొత్తమీద ఇప్పుడు ఆయన ఆస్తి విలువ దాదాపు 80కోట్లు ఉంటాయని టాక్. కాగా భౌతికంగా లేకున్నా ఆయన నటించిన పాత్రలే ఆయన్ని సజీవంగా ఉంచుతాయి.

