చిరంజీవి గుండు లుక్ వెనక రహస్యం ఏమిటో తెలుసా ?

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలో చిరు కి జోడిగా కాజల్ నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి దాదాపుగా 70 శాతం షూటింగ్ జరిగిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి గుండు లుక్ తో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే చిరంజీవి నటించే సినిమాలో ట్రైల్ లుక్ కోసం గుండు చేయించుకున్నారని సమాచారం.

తమిళంలో విజయం సాధించిన వేదాళం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారట అందులో భాగంగానే చిరంజీవి గుండు గీయించుకున్న సమాచారం. ఇది ఒక అవగాహన మాత్రమే. అసలు విషయం ఏమిటో చిరంజీవికి చెప్పితే కానీ అభిమానులకు తెలీదు. ఏది ఏమైనా చిరు అభిమానులు మాత్రం చిరు ఈ న్యూ లుక్ చాలా బాగుంది అని కామెంట్స్ పెడుతున్నారు.