వ్యాయామం సరదాగా చేయాలంటే….
జిమ్ కి వెళ్ళాలంటే బోర్…. వాకింగ్,సైక్లింగ్ వంటివి చేయాలని అనిపించదు. వ్యాయామాలు సరదాగా ఉండాలి. అదే సమయంలో సన్నగా మారాలి. వాటిని కోరుకొనే అమ్మాయిలకు కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి.
మీకు డాన్స్ అంటే ఇష్టం ఉంటే జుంబా ను ప్రయత్నించవచ్చు. శరీరాన్ని కదిలించి కొవ్వును సులువుగా కరిగించడంలో దీన్ని మించిన ఫిట్ నెస్ వ్యాయామం లేదు. అసలు వ్యాయామం చేసినట్లు ఉండదు. అలాగే చాలా సరదాగా ఉంటుంది. అలాగని డాన్స్ వచ్చినవారే చేయాలనీ అనుకునేరు. ఎవరైనా ప్రయత్నించవచ్చు. పైగా పలితం చాలా తక్కువ సమయంలోనే చూడవచ్చు. ఇందుకోసం ఇంటర్నెట్ లో జుంబా తరగతులను నేర్చుకోవచ్చు. ఇంటిలోనే కూర్చుని హాయిగా వ్యాయామం చేయవచ్చు.
హులా హువ్ రింగ్ గుర్తుందా… దీన్ని ఒక్కటి కొనుక్కోండి. మొదట్లో చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ… చాలా సులువు. ఇది పొట్టను టోన్ చేస్తూనే నడుము భాగాన్ని దృడంగా చేస్తుంది. ఇంటిలోనే చేసుకోవచ్చు. అయితే సరైన హులా హువ్ రింగ్ఎంచుకోవాలి. ముఖ్యంగా కొద్దిగా బరువు ఉన్నాది,పెద్దదీ ప్రయత్నించాలి.
తాడాట ఆడటం కూడా మంచి వ్యాయామమే. ఇది కండరాలను,ఎముకలను దృడంగా చేస్తుంది. పదిహేను నిముషాలు తాడాట ఆడితే దాదాపు 200 కేలరీలు కరుగుతాయి. అయితే దీన్ని ప్రారంభించే ముందు సౌకర్యంగా ఉన్న బూట్లను ఎంచుకోవాలి.
స్కేటింగ్ అనేది కేవలం పోటిల్లో పాల్గొనే వారికీ మాత్రమే అని అనుకుంటారు. కానీ ఇది కూడా కేలరీలను కరిగిస్తుంది. కీళ్ళకు మేలు చేస్తుంది. ముఖ్యంగా నడుము క్రింది బాగాన్ని తీరువుగా చేస్తుంది. కాళ్ళను కూడా దృడంగా ఉంచుతుంది.