Kitchen

డ్రై ఫ్రూట్ సమోసా

కావలసినవి:

మైదా – పావుకిలో
డాల్డా లేదా నెయ్యి – 50 గ్రా
ఉప్పు – చిటికెడు
కాజు, బాదం, కిస్‌మిస్, పిస్తా – అరకప్పు (అన్నీ కలిపి)
కోవా – అరకప్పు
ఏలకుల పొడి – అర టీ స్పూన్
లెమన్ ఎల్లో కలర్ – మూడు చుక్కలు
చక్కెర – అరకేజి
నూనె – వేయించడానికి తగినంత

తయారి:
జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలపాలి. తరవాత అందులో నీరు పోసి చపాతీ పిండిలా కలుపుకుని పక్కన ఉంచాలి. కోవానుపొడిగా చేయాలి. సన్నగా కట్ చేసుకున్న డ్పైఫ్రూట్స్, సగం ఏలకుల పొడి, కలర్ వేసి కలిపి పెట్టుకోవాలి. చక్కెరలో పావు కప్పు నీళ్లు పోసి ముదురుపాకం చేసుకుని అందులో మిగిలిన ఏలకుల పొడి కలపాలి. పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసాలా మడిచి వేడి నూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత వీటిని పంచదార పాకంలో వేసి అరగంట ఉంచి తీసి సర్వ్ చేయాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."