Devotional

వారంలో ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే మంచిదో తెలుసా ?

మనలో చాలా మంది ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలో తెలియక అయోమయంతో ఉంటారు. వారంలో ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఏ దేవునికి ఇష్టం ఆ రోజు ఏమి చేయాలి అనేది వివరంగా తెలుసుకుందాం

ఆదివారం
ఆదివారం సూర్య భగవాన్ కి చాలా ఇష్టమైన రోజు. ఆదివారం సూర్యుని ఆరాధించి ధాన్యం సమర్పిస్తే ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

సోమవారం
సోమవారం శివునికి ఇష్టమైన రోజు. ఆరోజు శివునికి మారేడు దళాలతో పూజ చేస్తే సిరిసంపదలు కలుగుతాయి

మంగళవారం
మంగళవారం ఆంజనేయ స్వామి ఇష్టం. అలాగే దుర్గాదేవి కూడా ఇష్టమైన రోజు. మంగళవారం రోజు ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ చేస్తే భయాలు రోగాలు పోతాయి.

బుధవారం
బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు. ఆరోజు వినాయకునికి ఎర్ర మందారాలతో పూజ చేస్తే అనుకున్న కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోతాయి

గురువారం
గురువారం గురు గ్రహం మరియు సాయి బాబా కి ఇష్టమైన రోజు. ఆరోజు సాయిబాబా కి పాలతో తయారు చేసిన పదార్థాలు నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి

శుక్రవారం
శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది

శనివారం
శనివారం వెంకటేశ్వర స్వామి కి ఇష్టమైన రోజు.