Devotional

వాహనాలకు నిమ్మకాయలు కట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా దిష్టి తగలకుండా నిమ్మకాయలు గుమ్మడికాయలు వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి ఉగ్ర దేవతల శాంతికి సహాయపడతాయి వాహనాలు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే సాత్విక దేవతల కంటే ఉగ్ర దేవతలనే ఎక్కువగా నమ్ముతారు. దేవునికి నిమ్మకాయలు నివేదించిన తర్వాత నిమ్మకాయలు వాహనాలకు కడతారు. దిష్టితీసి చక్రాలతో తొక్కిస్తారు. ఇందువల్ల మేలు జరుగుతుందని నమ్మకం. పుల్లగా ఉండే నిమ్మకాయ రసం, కారం నిండి ఉండే మిరపకాయలను వాహనాలకు, దుకాణాల వద్ద వేలాడదీయడం వెనుక జ్యోతిష శాస్త్ర కారణం ఉంది. గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం.

కుజుని అధిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు.