అలనాటి హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
టాలీవుడ్ లో బాలనటిగా అడుగుపెట్టి ఆతర్వాత స్టార్ హీరోయిన్స్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎగినవాళ్లు ఎందరో ఉన్నారు. అందులో నటి దీప ఒకరు. ఈమె 7 ఏళ్ల వయసులో మలయాళం సినిమా తో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత ఎన్నో మలయాళం, తమిళ్ సినిమాల లో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించింది. ఇక పెద్దయ్యాక 1976 లో అమెరికా అమ్మాయి మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టిన దీప అసలు పేరు ఉన్ని మేరీ. సినిమాల కోసం తన పేరుని దీప గా మార్చుకుంది. పంతులమ్మ, రంగూన్ రౌడీ, ఆత్మబలం, లేడీస్ టైలర్, స్వాతిముత్యం, రాము ఇలా చాలా సినిమాల్లో చేసి ఆడియన్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్ని సినిమాల్లో చేసినా కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలో చేయాలన్న కోరిక ప్రతిఒక్కరికీ ఉంటుంది. అందులో భాగంగా విశ్వనాధ్ కమల్ హాసన్ కాంబినేషన్ వచ్చిన స్వాతిముత్యం సినిమాలో దీపకు నటించే ఛాన్స్ వచ్చింది. సాగర సంగమం, శుభ సంకల్పం వంటి సినిమాలు కూడా విశ్వనాధ్,కమల్ హాసన్ కాంబోలో వచ్చినా స్వాతిముత్యం మూవీకి ఉన్న క్రేజ్ వేరు. అమాయకపు పాత్రలో కమల్ నటన అందరినీ కట్టిపడేసింది. అందులో బట్టలు ఉతికే సుబ్బులు పాత్రలో దీప నటించి తన నటనతో అందరినీ మెప్పించింది.
రాధిక మెడలో కమల్ తాళి కట్టాక ఇద్దరూ అన్యోన్యంగా ఉండేలా ఆ రాత్రి దీప చేసిన ఏర్పాట్లు, పిల్లాడిని తనతో ఇంటికి తీసుకుని వెళ్లిపోవడం ద్వారా బంధాన్ని బలపడేలా చేసిన క్యారెక్టర్ లో దీప ఒదిగిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనే కాదు, హిందీ లో కూడా రెండు చిత్రాల్లో నటించిన దీప 1982 లో ఎర్నాకులం లోని సెయింట్ ఆల్బర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ రెజోయ్ ని పెళ్లాడింది. వాళ్లకి నిర్మల్ అనే ఒక కొడుకు. అతడికి రంజని అనే ఆమెతో పెళ్లవ్వగా, రిహాన్ అనే కొడుకున్నాడు. కాగా 1990 లో వచ్చిన కలియుగ విశ్వామిత్ర మూవీలో దీప నటించింది. అదే ఆమె చివరి తెలుగు మూవీ.