Sports

ఒక సెంచరీ చేస్తే BCCI అంత డబ్బు ఇస్తుందా…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

క్రికెట్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ వచ్చింది అంటే టీవీలకు అతుక్కుపోయే వారు చాలా మంది ఉన్నారు. భారత జట్టు వారి ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రపంచంలోని రిచ్చెస్ట్ క్రికెట్ క్లబ్ పేరున బీసీసీఐ ప్రపంచంలో ఏ దేశానికి చెందిన క్రికెటర్స్ కి ఇవ్వనంత డబ్బు ఇండియన్ క్రికెటర్ కి ఇస్తుంది. క్రికెటర్ కి ఇచ్చే జీతమే కాకుండా బోనస్ రూపంలో కూడా చాలా ఎక్కువ మొత్తం ఇస్తుంది.

ఒక క్రికెటర్ టి20 ఆడితే మూడు లక్షల రూపాయలు వన్డే మ్యాచ్ ఆడితే ఆరు లక్షల రూపాయలు టెస్ట్ మ్యాచ్ ఆడితే పదిహేను లక్షల రూపాయలను వారికి ఇస్తుంది. అంతేకాకుండా సెంచరీ చేస్తే ఐదు లక్షలు డబుల్ సెంచరీ చేస్తే ఏడు లక్షలు బోనస్గా అందిస్తుంది. ఒక క్రికెటర్ 5 వికెట్లు తీస్తే ఐదు లక్షల రూపాయల బోనస్ ఇస్తుంది ఏ ప్లస్ క్యాటగిరి లో ఉన్న ఆటగాళ్లకు bcci సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు ఇస్తుంది. ఏ కేటగిరి లో ఉన్నవారికి ఐదు కోట్లు బి కేటగిరీ లో ఉన్నవారికి 3 కోట్లు సి కేటగిరీ లో ఉన్న వాళ్ళకి కోటి రూపాయలను ఇస్తుంది. ఇలా మన క్రికెటర్స్ సంవత్సరంలో కోట్ల రూపాయల జీతం,బోనస్ గా వారి పర్ఫామెన్స్ ని బట్టి ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు