హీరోయిన్స్ టాలెంట్ తో అదరకొట్టిన సినిమాలు… హీరోలు ఎందుకు సరిపోరు
హీరో లేకుండానే చిన్న హీరోను పెట్టి హీరోయిన్ ఇమేజ్ తో ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తావిస్తే, డర్టీ పిక్చర్స్ మూవీలో విద్యాబాలన్ నటన సూపర్భ్ . వాంప్ పాత్రలు చేసిన సిల్క్ స్మిత మీద బాలీవుడ్ లో తీసిన బయోపిక్ లో విద్యాబాలన్ చేస్తోందని తెల్సి అందరూ షాక్ అయ్యారు. బెంగాల్ నుంచి వచ్చి ఎన్నో హిట్ మూవీస్ లో చేసిన విద్యాబాలన్ ఒక్కసారిగా ఇలాంటి పాత్ర ఏమిటా అని అందరూ అనుకున్నారు. కానీ డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మితను కళ్ళకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించింది. దాంతో బాలీవుడ్ లో ఎన్నో ఒమెన్ మెయిన్ రోల్ మూవీస్ వచ్చాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్న కంగనా రౌనత్ చేసిన క్వీన్ మూవీ ఆమెలోని నటనను బయటపెట్టింది. ఒక అమ్మాయి స్వతంత్రంగా ఉండాలంటే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో ఈ సినిమాలో చూస్తాం. నేచురల్ ఉంటుంది ఈ మూవీ. దీంతో కంగనా స్టార్ అయింది. నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక ఈ మూవీలో సాంగ్స్ సూపర్.
అదితి బాలన్ చేసిన అరువి మూవీ చూస్తే, కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిపోయి,వాటి ప్రభావాన్ని మనమే పేస్ చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పింది. ఇంట్లోంచి గెంటేస్తే ,ఒంటరిగా బతికే అమ్మాయిని సొసైటీ ఎలా వాడుకుంటుందో క్లియర్ గా చూపించిన మూవీ ఇది. ఈ సినిమా కోసం ఎవరూ ఒప్పుకోకపోతే అదితి బాలన్ ఒకే చెప్పి ,అన్ని సీన్స్ అదరగొట్టేసింది. ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోలు చూస్తే ఆమె యాక్టింగ్ కి హేట్సాఫ్ చెప్పేస్తాం అలా ఉంటుంది. ఇక తెలుగులో అప్పటి దాకా గ్లామర్ పాత్రలతో రాణిస్తున్న విజయశాంతి ప్రతిఘటన మూవీతో ఊగిపోయే క్యారెక్టర్ తో అదరగొట్టేసింది. ఇక ఒసేయ్ రాములమ్మ చూస్తే విజయశాంతి హీరోయిజానికి ఫిదా కావాల్సిందే. గిరిజనులను భూస్వాములు ఎలా దోచుకునేవారు,నక్సలిస్టుల ఐడియాలజీ ఏమిటి వంటి వాటిని కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా ఇది.
ఒసేయ్ రాములమ్మ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ డైలాగ్స్ గానీ, ఫైట్స్ లో గానీ మాములుగా ఉండవు. సహజంగా ఓ ఆడది ఆపదలో ఉంటె మగాడు వచ్చి కాపాడతాడని అప్పటివరకూ సినిమాల్లో చూసాం. కానీ ఇది పూర్తి రివర్స్ . అంతలా విజయశాంతి చేసింది. ఎన్నో సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు అద్భుతంగా తీశారు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన అంతః పురం మూవీ చూస్తే అందులో ఫ్యాక్షనిజం ఎలా చూపించాడో చెప్పక్కర్లేదు. సౌందర్య ఈ మూవీలో ఒక ప్రేమికుడిలో ప్రేమను చూపిస్తుంది. అదేసమయంలో భయం భయంగా ఉంటూనే ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి తన కొడుకుని తీసుకుని బయట పడ్డానికి చూపిన తెగువ చూస్తాం. ఆరోజుల్లో అందరి స్టార్ హీరోస్ తో సూపర్ హిట్ కొట్టిన సౌందర్య అమ్మోరు లాంటి మూవీస్ తో లేడీ ఓరియెంటెండ్ మూవీస్ లో కూడా అదరగొట్టింది. ఇక శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చేసిన గుంజేన్ సక్సేనా లో పైలెట్ అవ్వడం కోసం పడే తపన ఆకట్టుకుంటుంది. మంచి విజువల్స్ తో తీసిన ఈ మూవీలో జాన్వీ యాక్టింగ్ కి ఎక్కడా పేరు పెట్టక్కర్లేదు.

