రఘువరన్ బిటెక్ సినిమా వెనక నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
బిటెక్ పూర్తిచేసిన కుర్రాళ్లకు స్ఫూర్తినిచ్చేలా రఘువరన్ బిటెక్ మూవీ అటు తమిళ యువతనే కాదు,ఇటు తెలుగు యువతను కూడా బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరో కష్టాలకు కుంగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. మన పక్కింటి కుర్రాడు గుర్తొచ్చేలా ఉంటాడు. తల్లిని విపరీతంగా ప్రేమించడం,లవ్ లో ఉండడం ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి. ఇలా నేచురల్ గా సినిమా తీసేముందు ఎంత నేచురల్ గా ఆలోచించి తీశారో ,దానివెనుక ఎంతటి తపన ఉందొ వివరాల్లోకి వెళ్తే ఎన్నో తెలుస్తాయి. నిజ జీవితంలో కూడా ధనుష్ ఎంతగా కష్టపడ్డాడో మర్చిపోడు.
అందుకే ఎదుటివాడి నైపుణ్యం కూడా గుర్తించగలడు. వెట్రుమారన్ డైరెక్షన్ లో ఆడుకాలం మూవీ ధనుష్ చేస్తున్నాడు. కోడిపందేల నేపథ్యంలో సాగే ఈ మూవీలో కెమెరామెన్ వేలు రాజ్ పనితనం ధనుష్ కి బాగా నచ్చింది. వీలుచిక్కితే సెట్ లో అతనితో కబుర్లు. అయితే డైరెక్షన్ చేస్తే తాను లీడ్ రోల్ చేస్తానని ధనుష్ మాటిచ్చాడు. అయితే వేలురాజ్ నవ్వేసి ఊరుకున్నాడు.
అనుకోకుండా ఒకరోజు చిన్న స్టోరీ లైన్ వేలురాజ్ చెప్పడంతో సినిమా చేసేద్దాం అని ధనుష్ అన్నాడు. కానీ కెమెరా తప్ప డైరెక్షన్ రాదుకదా, అందుకే ఆ బాధ్యత కూడా ధనుష్ తీసుకున్నాడు. సముద్ర ఖనికి ఫాథర్ క్యారెక్టర్ ఫిక్స్ . తల్లి కేరక్టర్ లో శరణ్య ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అని మాటిచ్చారు. కమెడియన్ వివేక్ మొదటి భాగంలో ఉండకపోయినా ఒప్పుకున్నాడు.
అమలాపాల్ హీరోయిన్ గా, సురభి అసిస్టెంట్ గా ఫిక్స్ . అనిరుద్ సంగీతానికి ఒకే. అందులో రెండు పాటలు ధనుష్ రాసేసాడు. 2013లో ప్రారంభించి 8కోట్లతో2014మేలో పూర్తిచేశారు. ఎఫ్ ఎం ద్వారా సాంగ్స్ రిలీజ్. మంచి స్పందన వచ్చింది. అయితే కమల్ చేసిన సత్య మూవీ కాపీగా ఉందంటూ పుకార్లు వచ్చాయి. ప్రెస్ మీట్ లో ధనుష్ క్లారిటీ ఇచ్చాడు. 2014జులై 18సినిమా రిలీజ్.
తమిళనాడులో 350స్క్రీన్స్, కేరళలో 60స్క్రీన్స్,రిలీజ్ చేశారు. థియేటర్ కి వెళ్లిన ఇంజనీర్లు తమ జీవితంలో ఎదురైన అనుభవాలు,తమను తాము స్క్రీన్ మీద చూసుకున్నట్లు ఫీలయ్యారు. స్లమ్ ఏరియా నుంచి వచ్చిన ఇంజనీర్ కి,రిచ్ మ్యాన్ మధ్య వచ్చిన క్లాష్ లో పడిన డైలాగ్స్,పంచ్ లు అదిరిపోయాయి. ఈ సినిమా ధనుష్ తప్ప ఇంకెవరు చేసినా తేడా కొట్టేదన్న మాట విన్పించింది.అన్ని సెంటర్స్ లో ఈ మూవీ గురించి థియటర్స్ దగ్గర పండగ వాతావరణం ఉందని చెబుతుంటే ఆనందానికి హద్దుల్లేవు .
అనిరుద్ మ్యూజిక్, అమలాపాల్ నటన అన్నీ కుదిరాయి. 2015జనవరి 1న తెలుగులో రిలీజయింది. అయితే ఆసమయానికి ముకుంద, రజనీ లింగ వంటి సినిమాలు ఉండటంతో నాలుగు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి,హిట్ టాక్ తెచ్చుకుంది. వివేక్ కామెడీ,అతడికి ఉత్తేజ్ తెలుగులో చెప్పిన డైలాగ్ బాగా వర్కవుట్ అయింది. 53కోట్లు కలెక్ట్ చేసింది.