Movies

కుర్ర హీరోలకు ధీటుగా సీనియర్స్ హీరోస్… ఎక్కడ తగ్గటం లేదు

టాలీవుడ్ లో ఇప్పుడు ఒకప్పటి తరం హీరోల మూడో తరం కూడా ఇండస్ట్రీకి వచ్చేసింది దుమ్మురేపుతోంది. కొడుకులు,మేనల్లుళ్లు,అన్న కొడుకులు ఇలా చాలామంది ఫీల్డ్ లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపు పదిమంది వరకూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసారు. ఇక ఈయన వయసు 65. అయినా బ్యాక్ టు బాస్ అంటూ వరుస మూవీస్ తో కుమ్మేస్తున్నారు.

ఇక నందమూరి నటవారసుడిగా వచ్చిన బాలకృష్ణ ఎన్నో హిట్స్ మూవీస్ చేసారు. వయసు 60 వచ్చినా సరే, ఇంకా మాస్ ఫాలోయింగ్‌లో బాలయ్య కు ఢోకా లేదన్నట్లు ఉంది. ఓపక్క వరుసకు కొడుకైన జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్స్ తో ఉన్నాడు. మరోవైపు అక్కినేని వారసుడు నాగార్జున ఇప్పటికీ మన్మధుడే. వయసు 61 వచ్చినా దూసుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం హిట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇక ఈయన ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఫీల్డ్ లో ఉన్నారు. దగ్గుబాటి రామానాయుడు కొడుకుగా వెంకటేష్ ఇండస్ట్రీలో మహిళా ఫాలోయింగ్ గల నటుడిగా పేరుతెచ్చుకున్నారు. వయసు 61 అప్పటికీ ఇప్పటికీ మంచి ఇమేజ్ తో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య గురు, ఎఫ్ 2, వెంకీ మామ లాంటి సినిమాలతో వరస విజయాలు అందుకున్నాడు. మరోపక్క అన్న కొడుకు రానా కూడా హీరోగా, విలన్ గా దూసుకెళ్తున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ మూవీస్ అయినప్పటికీ క్రేజ్ మాత్రం భారీగానే ఉంది. వయసు 50 వ పడిలో వున్నా పవన్ సినిమా వస్తే అభిమానులు పండగ వాతావరణమే. మాస్ మహారాజు రవితేజ స్వయం కృషితోనే హీరోగా ఎన్నో హిట్స్ కొట్టాడు. వయసు 52 ఏళ్ళు వచ్చేసాయి. అయితే 34 ఏళ్లకు హీరో అయిన రవితేజ ఆ తర్వాత పదేళ్ల పాటు కుమ్మేసాడు. అయితే ప్రస్తుతం హిట్ కోసం తపిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన టాలెంట్ తో సూపర్ స్టార్ అయ్యాడు. వయసు 46 లోనే ఉన్నాడు. సీనియర్ హీరో గా 20 ఏళ్లకు పైగానే అనుభవం ఉన్న మహేష్ టాలీవుడ్ నెంబర్ వన్ పోటీలో మహేష్ కూడా ఉన్నాడు.