Movies

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

కరోనా నిబంధనల నేపథ్యంలో స్టార్ మాలో రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయ్యి అప్పుడే వారం దాటింది. అయితే 16మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ అందులో సెలబ్రిటీలు తక్కువమంది ఉన్నారని పలువురు వాపోతోన్నారు. ఇలా అయితే ఓట్లు ఎలా వేయాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే యూట్యూబ్ స్టార్ గంగవ్వ కు ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఇక గత సీజన్ కి హోస్ట్ గా ఉన్న కింగ్ నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా ఉన్నాడు. మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ , గంగవ్వ, సయ్యద్ సోహెల్ , కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా వచ్చారు.

ఇందులో అసలు తెలియని వాళ్లు కాకుండా కొంతమంది బాగా తెలిసిన వాళ్ళని, ఇంకొంతమంది సోషల్ మీడియా లో పాపులర్ అయిన వాళ్లని బిగ్ బాస్ నిర్వాహకులే చెబుతున్నారు. అయితే ఈ కంటెస్టెంట్స్ లో కొంచెం ఎక్కువ గా లాస్య, దేవి నాగవల్లి, దేత్తడి హారిక, గంగవ్వ, మోనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్ పాపులర్ అయ్యారు. నిజానికి ఎక్కువ రెమ్యునరేషన్ కూడా వీళ్ళకే ఇస్తున్నట్లు టాక్. ప్రతి సీజన్ లో ఒకరిద్దరికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఈ సీజన్ లో దాదాపు 10 సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో ఉంటూ యాంకర్ గా పేరు తెచ్చుకున్న లాస్య కి రోజుకు లక్ష రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటోందని టాక్.

మొదటి వీక్ నామినేషన్ లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అవ్వడంతో … ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కుమార్ సాయి కి రోజుకి 10 వేల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, అలేఖ్య హారిక, మోనాల్ గజ్జర్ కి ఒక రెమ్యునరేషన్ కూడా బాగానే ముడుతున్నట్లు చెబుతున్నారు. ఇక యూ ట్యూబ్ లో మై విలేజ్ షో అనే చానల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ కి వారానికి మూడు నుండి నాలుగు లక్షల వరకూ ఇస్తున్నారట. ఇంకా మరికొందరు వైల్డ్ కార్డు ద్వారా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."