Movies

నెంబర్ వన్ సినిమా గురించి నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన నెంబర్ వన్ మూవీ ఓ సెన్షనల్ మూవీ. ఎందుకంటే బ్రేక్ డాన్స్ ల కాలంలో ఇక కృష్ణ పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో అతడిలో గల మైనస్ పాయింట్స్ కవర్ చేస్తూ తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. 1994సంక్రాంతి మూవీస్ లో నెంబర్ వన్ విజేతగా నిల్చింది. కృష్ణ సరసన తొలిసారిగా సౌందర్య నటించి మరింత వన్నె తెచ్చింది.

అంతేకాదు,వారం ముందు మెగాస్టార్ ముగ్గురు మొనగాళ్లు,వారం తర్వాత కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు దెబ్బతిన్నాయి. కోట శ్రీనివాసరావు, మహేష్ ఆనంద్ విలన్స్ గా నటించారు. స్వతహాగా కృష్ణ అభిమాని కావడంతో కృష్ణారెడ్డి సరికొత్త లుక్ లో కృష్ణను ఆవిష్క రించాడు. ఒక్కసారిగా కృష్ణలో ఇన్ని మార్పులు చూసిన ఫాన్స్ ఉబ్బితబ్బిబ్బ య్యారు. గత చిత్రాలకు భిన్నంగా కృష్ణను చూపిస్తానని ముందే ప్రకటించిన కృష్ణారెడ్డి అన్నమాట నిలబెట్టుకున్నారు.

శాడిస్ట్ విలన్ మహేష్ ఆనంద్,బ్రహ్మానందం మధ్య హాస్యం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. యాక్టింగ్, స్టిల్స్, సాంగ్స్ ,కాస్ట్యూమ్స్ ఇలా అన్నింటా పాతికేళ్ల కుర్ర కృష్ణను చూపించాడు. అర్జునుడు,శివాజీ, చార్లీ చాంప్లిన్,రోమన్ యోధుడు,రాజు,నీగ్రో గెటప్స్ కూడా కృష్ణతో కృష్ణారెడ్డి వేయించి ఔరా అనిపించాడు. కాస్ట్యూమ్స్ విషయంలో వాడిన డ్రెస్ మళ్ళీ వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అందుకే నెంబర్ వన్ ఆకర్షణీయంగా రూపొందింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."