తండ్రీకొడుకుల కాంబినేషన్ లో ఎన్ని హిట్స్ …ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా ?
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా సూపర్ కృష్ణ కు పేరుంది. తెలుగులో ఎన్నో సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టిన కృష్ణ ఎన్నో విజయవంతమైన మూవీస్ చేసాడు. ఇక పెద్ద కొడుకు రమేష్ ఐదేళ్ల వయస్సులోనే కెమెరా ముందుకి వచ్చాడు. అగ్ని పరీక్ష తో మొదలు పెట్టి మోసగాళ్లకు మోసగాడు,అల్లూరి సీతారామరాజు,దేవుడు చేసిన మనుషులు,కురుక్షేత్రం ,అన్నదమ్ముల సవాల్, వంటి మూవీస్ లో బాల నటుడిగా మెప్పించాడు. ఇక తానే హీరోగా నీడ చిత్రంలో నటించాడు. అప్పటికి 17ఏళ్ళు. ఇక రమేష్ చైల్డ్ ఆర్టిస్టుగా అదే ఆఖరి మూవీ.
తర్వాత మద్రాసు లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన రమేష్ 24ఏళ్ల వయస్సులో సామ్రాట్ గా వచ్చాడు. ఇక తండ్రితో కల్సి కలియుగ కర్ణుడు మూవీలో చేసాడు. కృష్ణ సరసన జయప్రద నటించగా, రమేష్ సరసన జూహ్లీ చావ్లా నటించింది. అయితే ఈ సినిమా కోసం ఆమె పేరుని మీనాగా మార్చారు. ఇద్దరూ కల్సి నటించిన రెండో మూవీ ముగ్గురు కొడుకులు. ఇందులో మహేష్ కూడా నటించాడు. తర్వాత బజారు రౌడీ మూవీ రమేష్ హీరోగా వస్తే, కృష్ణ అతిధి పాత్ర వేసాడు.
అలాగే ఆయుధం మూవీలో కృష్ణ ,రమేష్ కల్సి నటించారు. కృష్ణ కలెక్టర్ గా, రమేష్ రౌడీగా నటించారు. ఇద్దరి మధ్యా ఫైట్ బాగా క్లిక్ అయింది. తర్వాత నా ఇల్లే నా స్వర్గం మూవీలో కృష్ణ ,రమేష్ అన్నదమ్ములుగా నటించారు. కృష్ణ సరసన రూపా గంగూలీ,రమేష్ సరసన దివ్యభారతి నటించారు. తర్వాత బ్లాక్ టైగర్, పచ్చతోరణం, అన్నాచెల్లెలు మూవీస్ పద్మాలయ బ్యానర్ మీద తీశారు. ఇక కృష్ణ,రమేష్ కాంబోలో చివరి చిత్రంగా ఎన్ కౌంటర్ మూవీ వచ్చింది. శంకర్ ఈ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ నక్సలైట్ గా, రమేష్ స్టూడెంట్ గా వేశారు. ఇక ఆతర్వాత రమేష్ బాబు ఏ మూవీలోనూ కనిపించలేదు.