Movies

గబ్బర్ సింగ్ సినిమా గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా…తెలిస్తే అసలు నమ్మలేరు

నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ కి తగ్గ సినిమా ఖుషి తర్వాత రాకపోవడంతో ఫాన్స్ లో ఎక్కడో అసంతృప్తి ఉంది. మధ్యలో జల్సా మూవీ కొంత ఊరటనిచ్చినా సరే, పూర్తిస్థాయి సంతృప్తి లేదు. ఆ టైం లో గబ్బర్ సింగ్ వచ్చి దుమ్ములేపింది. హరీష్ శంకర్ డైరెక్టర్ గా వచ్చిన ఈ మూవీలో ‘నాకు తిక్క ఉంది .. దానికో లెక్కుంది’అంటూ చెప్పిన డైలాగ్ సూపర్భ్ . 1999జులై 15 న తమ్ముడు సినిమా కటౌట్ కి దండలు వేసి,సినిమా చూసిన అభిమాని,ఎప్పటికైనా పవన్ తో ఓ ఫోటో దిగాలన్న కోరిక. అతడే హరీష్ శంకర్. మొత్తానికి సినిమాల్లోకి ఎంటర్ అయ్యాక షాక్ మూవీ రవితేజతో తీసాడు. కానీ ప్లాప్ అవ్వడంతో నిరాశ చెందకుండా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఈలోగా బండ్ల గణేష్ తో క్లోజ్ అవ్వడంతో ,ఓరోజు పవన్ కళ్యాణ్ కి కథ చెప్పాలని ఫోన్ చేసాడు. వెంటనే ఫామ్ హౌస్ కి వెళ్ళాడు. అక్కడ గంటన్నర కథ విన్నాక పవన్ నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా సెకాండాఫ్ చెప్పాలి. సినిమా చేద్దాం అని హామీ ఇచ్చేసాడు. కానీ తీన్ మార్ మూవీ జయంత్ సి పరాన్జీ తో పవన్ చేస్తున్నాడు. దీంతో అప్పటికే ఇంకో కథ రెడీ గా ఉండడంతో రవితేజతో మిరపకాయ్ మూవీ హరీష్ తీసాడు. ఆ సినిమా రిజల్ట్ చూసాక ఊరటనిచ్చింది.

ఈలోగా ఈవీవీ సత్యనారాయణ మరణించడంతో ఆయన డెడ్ బాడీని మోసి,ఇంటికెళ్ళేసరికి పవన్ నుంచి ఫోన్ వచ్చింది. స్నానం చేసి వెళ్లేసరికి పవన్ పోలీసాఫీసర్ గెటప్ లో ఉన్నాడు. హిందీ మూవీ దబాంగ్ తెలుగులో చేస్తున్నాం,నువ్వే డైరెక్టర్ ,రెమ్యునరేషన్ ఎంత కావలి అని పవన్ చకచకా అనేశాడు. ఈ సినిమా పవన్ తీస్తున్నందున అలా అడిగేసరికి, మీ గెటప్ కి,మేనరిజం కి తగ్గట్టు మార్పులు చేసే ఛాన్స్ ఇవ్వండి అదే రెమ్యునరేషన్ అన్నాడు హరీష్. అయితే పవన్ మాత్రం అడ్వాన్స్ గా కవర్ ఇచ్చేసాడు. పంజా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా గబ్బర్ సింగ్ పై చర్చ లు జరిగాయి. మొత్తానికి అన్నీ కుదరడంతో తీన్ మార్ మూవీతో దెబ్బతిన్న బండ్ల గణేష్ కి గబ్బర్ సింగ్ తీసే ఛాన్స్ పవన్ ఇచ్చేసాడు. అలా సినిమా స్టార్ట్ కి ఏర్పాట్లు.

హీరోయిన్ గా శృతి హాసన్ కన్ఫర్మ్. 2011డిసెంబర్ 4 మిట్ట మధ్యాహ్నం షూటింగ్ స్టార్ట్. ఈలోగా పంజా ప్లాప్. ఫాన్స్ నిరాశలో ఉన్నారు. దాంతో గబ్బర్ సింగ్ ఎలా ఉంటోందో టీజర్ రిలీజ్ చేయాలన్న యోచనతోనాకు కొంచెం తిక్కుంది ,దానికో లెక్కుంది’అనే డైలాగ్ రాసుకొచ్చి చెప్పడంతో పవన్ ఒకే చేసాడు. ఆ ఒక్క డైలాగ్ తో టీజర్ వచ్చేసరికి గబ్బర్ సింగ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఐటెం సాంగ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ కసరత్తు చేస్తుంటే వాళ్ళ ఫాదర్ సత్యమూర్తి అక్కడే ఉన్నారు. ఎందుకురా టెన్షన్ ‘కెవ్వు కేక’అని స్టార్ట్ చెయ్యి అనగానే దేవిశ్రీ చెలరేగిపోయాడు. ఇక అంత్యాక్షరి కోసం 200సాంగ్స్ సెలెక్ట్ చేసి అందులోంచి కొన్ని ఎంచుకున్నారు.

సినిమా హ్యాపీ గా పూర్తయి,డబ్బింగ్ కూడా పూర్తయింది. 2012మే11 న మండుటెండలో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డుల మోత మోగించింది. రిపీట్ గా చూడ్డానికి ఫాన్స్ ఎగబడ్డారు. ఆ సెంటర్ ఈ సెంటర్ అనే తేడా లేకుండా గబ్బర్ సింగ్ ఊపేస్తుంటే, ఖుషీ తర్వాత అలాంటి మూవీ చూడగలమా అనుకున్న ఫాన్స్ లో ఆనందం. 306సెంటర్స్ లో 50రోజులు,65సెంటర్స్ లో 100రోజులు ఆడింది. అప్పట్లో 69కోట్ల షేర్ కలెక్ట్ చేసి ,ఇండస్ట్రీ హిట్ అయింది. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన గబ్బర్ సింగ్ తర్వాత పవన్ మార్కెట్ పెరిగిపోయింది. ఇందులో డైలాగ్స్, మేనరిజం,సాంగ్స్ అన్నీ ఇప్పటికీ కొట్టగానే ఉంటాయి. దటీజ్ గబ్బర్ సింగ్.