ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా..జీవితంలో ఎన్ని కష్టాలో పాపం ?
తెలుగుతో పాటు దక్షిణాది భాషలు,అలాగే హిందీలో కల్పి 600 సినిమాల్లో నటించిన లక్ష్మి హీరోయిన్ మొదలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఎన్టీఆర్, అక్కినేని,శివాజీ గణేశన్,కన్నడ రాజ్ కుమార్ వంటి అగ్ర నటులలో నటించిన లక్ష్మి అయితే వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్లతో కొంత వివాదాస్పదం అయింది. లక్ష్మి తల్లి రుక్మిణి కూడా ఒకప్పటి నటి. తండ్రి వైవి రావు నిర్మాత దర్శకుడు. కూతురిని సినిమాల్లో పెట్టడం ఇష్టం లేకపోవడంతో 17ఏళ్ల వయస్సులో ఇన్స్యూరెన్స్ కంపెనీలో చేసే భాస్కర్ తో 1969లో పెళ్లి చేసింది.
ఒక ఆడపిల్ల పుట్టాక భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. తల్లితో ఉంటూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి కొంత కాలం తర్వాత మలయాళ నటుడు మోహన్ శర్మను పెళ్లిచేసుకుంది. బంధాలు అనుబంధాలు సినిమా కూడా ఈమె నిర్మించారు. పెళ్లయ్యాక 8ఏళ్ళు పూర్తవ్వడంతో పిల్లలు లేకపోవడం, ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో 1987లో విడాకులు తీసుకుంది. మరో రెండేళ్లకు నటుడు,దర్శకుడు శివచంద్రన్ ని పెళ్లాడింది. మొదటి భర్తతో పుట్టిన ఐశ్వర్యను కన్నడ మూవీతో ఎంట్రీ ఇప్పించారు. వినోద్ కుమార్ హీరోగా చేసిన ఈ సినిమాకు శివచంద్రన్ డైరెక్షన్ చేసాడు.
ఇక మూడవ పెళ్లి తర్వాత ఒకపాప పుట్టింది. తెలుగులో జగపతి బాబు హీరోగా అడవిలో అభిమన్యుడు మూవీతో ఐశ్వర్య నటించింది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర చనువు ఎక్కువ. అందుకే షూటింగ్స్ వెళ్ళేటప్పుడు అమ్మమ్మను వెంట తీసుకెళ్లేది. అయితే తన్వీర్ అనే తోళ్ల వ్యాపారి మాయలో పడిపోయిన ఐశ్వర్య ఒకరోజు ఎవరికీ చెప్పకుండా అతడితో లేచిపోయింది. 1993లో పెళ్లి చేసుకోవడంతో అప్సనా గా పేరు మార్చుకుని,ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తన్వీర్ హింస భరించలేక తల్లి లక్ష్మి దగ్గరకు ఐశ్వర్య వచ్చేసింది. అప్పటి నుంచి తల్లితోనే ఉంటోంది.